Sri Bhavani Bangaru Soudamma Temple | Manasa Hills | Rajendhra Nagar | Hyderabad

 

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ చివరన జంట నగరాలకి జలశ్రయం ఐన హిమాయత్ సాగర్ అనే డ్యామ్ కి అతి చేరువలోనే మానస హీల్స్ అనే ప్రాంతం వద్ద ఈ దేవాలయం ఉన్నది. 

ఈ ఆలయం లో అమ్మవారిని శ్రీ భవాని బంగారు సౌడమ్మ ఆలయంగా పిల్సుస్తారు. తెలంగాణ లోని అమ్మవారికి మరియు ఈ అమ్మవారికి కూడా కళ్ళు , మందు , నాన్ వెజ్ నైవేద్యంగా స్భక్తులు సమర్పిస్తారు. 

ఈ అమ్మవారు గ్రామ దేవతగా మరియు ఊరు అంతటికీ పెద్దమ్మగా పిలుస్తారు. కొందరు భక్తులు నెలకి ఒక్కసారి మరి కొందరు 03నెలలకి ఒక్కసారి, కొందరు భక్తులు 6 నెలలకి ఒక్కసారి తప్పకుండ దర్శించుకుంటారు. ఇక్కడి భక్తులు కొందరు ఈ అమ్మవారిని వారి ఇంటి ఇలా వేల్పుగా కూడా పిలుచుకుంటారు. 

ఈ ఆలయం హిమాయత్ సాగర్ డ్యామ్ కి అతి దగ్గరలో ఉండడం వల్ల నీటికి ఎటువంటి కొరత ఉండధు. 

ఈ అమ్మవారికి ప్రతి మంగళవారం , శుక్రవారం , ఆదివారం , దసరా సమయంలో చాలా విశేష పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. సిటి కి చాలా దూరంగా ఉండడం వల్ల చాలా మందికి ఈ ఆలయం గురించి సారిగ్గా తెలియదు. ఈ ఆలయం వద్ద చాలా పెద్ద పార్కింగ్ సౌకర్యం కలదు. ద్వి చక్ర, త్రీ చక్ర, కార్  బస్, భారీ వాహనాల పూజలు కూడా ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ అమ్మవారి సన్నిధిలో వాహనాల పూజలు జరిపించుకుంటే వాహనంకి మరియు అందులో ప్రయాణించే వారికి ఎటువంటి వాహన ప్రమాదాలు జరగకుండా ఇక్కడ అమ్మవారు రక్షిస్తుంది అని భక్తుల ప్రగడ విశ్వాసం. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 01:00 బ్రేక్

తిరిగి 01:00 నుంచి 07:00 వరకు మాత్రమే. 

ఈ ఆలయం చాలా లోపలికి ఉండడం వల్ల మరియు సరియైన బస్ మరియు ఇతర ఆటొ సౌకర్యం లేనందు వల్లన ఈ ఆలయం తొందరనే మూసి వేస్తారు. కొన్ని రకాల క్రూర జంతువులు కూడా ఇక్కడ సంచరిస్తూ ఉంటాయి. 


#Sri Bhavani Bangaru Soudamma Temple  #Manasa Hills  #Rajendhra Nagar  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana