Sri Mallanna Swamy Temple | Shatamrai | Shamshabad | Hyderabad


 ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు కట్టించారో కూడా సరియైన సమాచారం లేదు. కానీ ఆలయం నమూనా మరియు ఆలయ ప్రకరాలు చూస్తే ఈ ఆలయం సుమారు 50 సంవ్సరాల కంటే ముందే ఈ ఆలయాన్ని నిర్మించారు అని తెలుస్తుంది. 

ఈ ఆలయం హైదరబాద్ లోని శంషాబాద్ వద్ద గల శాతం రాయ్ అని గ్రామానికి 05కి.మీ దూరంలో ఈ దేవాలయం ఉన్నది. శాతంరాయ్ అనే గ్రామం నుంచి కొంచం ముందుకు వెళ్లానే శంషాబాద్ కి వెళ్ళే బ్రిడ్జ్ ఎక్కకుండ ఎడమ వైపుకు వెళ్ళాలి. ఇతర మతస్థుల ప్రార్ధన స్థలం నుంచే ఇంకా ఎడమ వైపుకు వెళ్ళితే ఆ రోడ్ మార్గం గుండా గూగుల్ మాప్ ప్రకారం వెళ్ళితే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. 

ఈ ఆలయంలో మనకి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఏ గుడిలో నైనా మల్లన స్వామి అంటే విగ్రహ రూపంలో దర్శనం ఇస్తారు కానీ ఇక్కడ మాత్రం శివ లింగ రూపంలో దర్శనం ఇస్తారు. మీరు కొమరవెళ్ళి లోని మల్లన్న స్వామి ని దర్శించుకుంటే తేడా అర్ధం అవుతుంది. 

ఈ ఆలయం ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో ప్రధానంగా శ్రీ గణపతి స్వామి ఆలయం, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం, శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం , హోమగుండం , గోశాల , శ్రీ హనుమాన్ ఆలయం కూడా ఉన్నాయి. 

ప్రతి మాస శివరాత్రి రోజున , మరియు మహా శివరాత్రి రోజున , శ్రీ ఆంజనేయ స్వామి జయంతి రోజున విశేష పూజలు నిర్వహిస్తారు. శివ మాలాల సమయంలో మరియు అయ్యప్ప మాలా భక్తులు ఈ ఆలయంలో బస చేసి తిరిగు ప్రయాణం చేస్తారు. ఈ ఆలయం చాలా లోపలికి ఉన్న చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపల అంతా పచ్చటి వాతావరణం , ఎటువంటి వాహనాల చప్పుడు లేకుండా అంతా ప్రశాంతంగా ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 01:00 

మధ్యాన్నం : 01:00 నుంచి 03:30 బ్రేక్

సాయంత్రం : 03:30 నుంచి 07:30 మాత్రమే 

ఈ ఆలయం చాలా లోపల ఉండడం వల్ల వెలుతులు ఉన్నప్పుడే ఈ ఆలయానికి భక్తులు వస్తారు. ఆటొ మరియు బస్ సౌకర్యం కూడా లేకపోవడం బాధాకరం. 

#Sri Mallanna Swamy Temple  #Shatamrai  #Shamshabad  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana