Prachin Hanuman Temple | Attapur | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం పేరులోనే మనకి అర్ధం అవుతుంది. ప్రాచీన హనుమాన్ దేవాలయం. ఈ ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది. మరియు  ఈ దేవాలయం కూడా కొంచం కిందికి ఉంటుంది. 

ఈ దేవాలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ కి కేవలం 3కి.మీ దూరంలో ఉంటుంది. ఈ దేవాలయానికి చేరుకోవడానికి మెహిందిపట్నం నుంచి అత్తాపూర్ బస్ స్టాండ్ వద్ద దిగి ఆటొలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయానికి డైరెక్ట్ గా బస్ సౌకర్యం లేదు. ఆటొ వాళ్ళు ఈ ఆలయం పేరు చెపితే అక్కడే దిపేస్తారు.  S

ఈ దేవాలయం మొత్తం కూడా రాతి తో నిర్మించారు. ఈ హనుమాన్ దేవాలయం సుమారు 250 సం|| కంటే ముందు నుంచే ఉన్నది అని ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ దేవాలయం చూడడానికి బయటి నుంచి చాలా చిన్నగా ఉన్న కూడా చాలా శక్తివంతమైన దేవాలయం. 

ఈ దేవాలయం బయట చాలా పెద్ద పార్కింగ్ సౌకర్యం ఉన్నది. ఒక్కటే సారి 10 కార్ ల వరకు ఇక్కడ నిలుపవచ్చు. ఈ దేవాలయం లో శ్రీ రామ నవమి , సీతారాముల కళ్యాణం , హనుమాన్ జయంతి వేడుకలు చాలా వైభవంగా నిర్వహిస్తారు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : :06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు 

#Prachin Hanuman Temple  #Attapur #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana