Sri Sri Sri Pochamma Thalli Temple | Attapur | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని నిర్మించి ఇప్పటికీ 15సం|| కంటే ముందు నుంచే ఈ ఆలయం ఇక్కడ ఉండేది. అప్పుడు ఆలయం చాలా చిన్నదిగా ఉండేది. కొద్ది నెలల క్రితమే పునః నిర్మాణం చేశారు. కేవలం ద్వి చక్ర వాహనం పార్కింగ్ సౌకర్యం కలదు.
ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద కలదు. ఈ ఆలయంనికి చేరుకోవాలి అంటే మొదట మెహిందిపట్నం చేరుకొని అక్కడి నుంచి అత్తాపూర్ కి రావాలి. అక్కడి నుంచి ఈ ఆలయానికి ఆటొలో చేరుకోవచ్చు.
ఇక్కడి భక్తులు ఈ అమ్మవారిని శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయముగా పిలుస్తారు. ఈ ఆలయం లో ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున్న నిర్వహిస్తారు. ఆ రోజు సాయంత్రం అమ్మవారి తమ్ముడు పోతరాజుగా కొందరు భక్తులు పోతరాజు వేషం వేసి అమ్మవారికి గుమ్మడికాయలను నైవేద్యంగా సమర్పిస్తారు. దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా పెద్ద ఎత్తున్న నిర్వహిస్తారు. 9 రోజుల పాటు అమ్మవారికి వివిధ అలంకరణలు చేసి హోమలు నిర్వహిస్తారు. అప్పుడు భక్తులు చాలా మంది వస్తారు. కుంకుమార్చనలు , లలితా సహస్రనామ పారాయణం , దేవి పురాణగాధలు వినడం జరుగుతుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు
#Sri Sri Sri Pochamma Thalli Temple #Attapur #Hyderabad

Comments
Post a Comment