Sri Rama Temple | Sharada Nagar | Opp Kakatiya vidhyanikethan School | Mehindipatnam | Hyderabad

 

  

ఈ ఆలయం చాలా ప్రసిద్దమైన ఆలయం మరియు ఈ దేవాలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం బయట నుంచి చూస్తే చాలా చిన్నగా కనిపించిన కూడా లోపల మాత్రం చాలా పెద్దగానే ఉంటుంది. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని శారద నగర్ వద్ద ఉన్న కాకతీయ విధ్యానికేతన్ స్కూల్ ఎదురుగా ఉంటుంది. ఇది మెహిందీపట్నం కి కేవలం 02 కి.మీ దూరం లో ఉంటుంది. ఈ ఆలయం కి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. కేవలం ద్విచక్ర వాహనం పార్కింగ్ మాత్రమే ఉంది. త్రీ చక్ర వాహనం , కార్ , బస్ ఇతర పెద్ద వాహనాలు పార్కింగ్ సౌకర్యం లేదు. కార్ లు స్కూల్ ఎదురుగా ఉన్న కాలనీ లో పార్కింగ్ చేసి నడుచుకుంటూ కూడా వెళ్లవచ్చు. 

ఈ దేవాలయంలో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ ఆంజనేయ స్వామీ ఆలయం , శ్రీ గణపతి స్వామి ఆలయం , శివాలయం ,  శ్రీ దుర్గా దేవి ఆలయం , నవగ్రహ మండపం కూడా ఉన్నాయి. ప్రతి సం || మహా శివారాత్రి రోజున ప్రత్యేక అభిషేకాలు , హోమలు , భజనలు , తరువాత రోజున అందరికీ ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కూడా నిర్వహిస్తారు. 

గణపతి ఉత్సవాలు , దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా జరుగుతాయి. శ్రీ రామ నవమి , సీతారాముల కళ్యాణం , కూడా నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి రోజున విశేష పూజలు , అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 08:00 వరకు 


#Sri Rama Temple  #Sharada Nagar  #Opp Kakatiya vidhyanikethan School  #Mehindipatnam #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana