Shiva Temple | Shivarampally | Opp PVNR 280 | Rajendhra Nagar | Hyderabad

 

ఈ ఆలయం చాలా చిన్న ఆలయం మరియు ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం ఎదురుగా ఉన్న ఆ రవి చెట్టు ఎన్నో సం|| నుంచి ఉన్నదో ఎవ్వరికీ తెలియదు. ఆలయం చాలా చిన్నదిగా ఉన్న కూడా చాలా మంది భక్తులు వస్తు ఉంటారు. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని ఆరంఘర్ మరియు శివరంపల్లి అనే రెండు గ్రామాలకి మధ్యలో ఉంటుంది. ఈ ఆలయం సరిగ్గా పి.వి. నరసింహ రావు ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 280 కి సరిగ్గా ఎదురుగా ఈ ఆలయం ఉంటుంది. రాయల్ జ్యూస్ సెంటర్ కి ఎదురుగా ఈ ఆలయం ఉంటుంది. 

ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శివలింగం ఉన్నది. బయట గణపతి , హనుమాన్ , నందీశ్వరుడు కలరు. ఆలయం బయట రాతితో నిర్మించిన ధ్వజ స్తంభం కలదు. ఈ ఆలయానికి శివరాత్రి కి నెల రోజుల ముందు నుంచే అనగా మాఘ మాసం నుంచి మరియు డిసెంబర్ నెల లో అయ్యప్ప స్వామి భక్తులు కూడా చాలా మంది ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ సమయం లలో ఈ ఆలయంలో ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్

సాయంత్రం : 05:00 నుంచి 07:30 వరకు 


#Shiva Temple #Shivarampally #Opp PVNR 280  #Rajendhra Nagar  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana