Mata ka Mandir | Machaleshwar | Manchirevula | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని 15 సం || కంటే ముందు నుంచే ఉన్నప్పటికి పాత ఆలయం కొంచం చిన్నదిగా ఉండేధి. ఇప్పుడు అందరూ కలిసి కొంచం పెద్దిగా నిర్మించుకున్నారు. 

ఈ ఆలయంలో దేవి నవరాత్రి లో నవ దుర్గలు గా ఏవిధంగా ఐతే పూజిస్తామో అదే విధంగా ఇక్కడ నవ దుర్గాదేవతలను పూజిస్తారు. ప్రతి మంగళ వారం రోజున మరియు శుక్రవారం రోజున అమ్మవారికి కుంకుమార్చన , అభిషేకం , ప్రత్యేక అలంకరణలు నిర్వహిస్తారు. దేవి నవరాత్రి రోజులలో మాత్రమే కాకుండా ఆషాఢ మాసంలో బోనాల పండుగ కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. 

ఈ ఆలయం హైదరబాద్ లోని మంచిరేవుల వద్ద గల మాచలేశ్వర్ వద్ద మాత కా మందిర్ అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆలయం కి చాలా పెద్ద పార్కింగ్ సౌకర్యం కలదు. ద్వి చక్ర , త్రీ చక్ర , కార్, బస్, భారీ వాహనాలు కూడా ఇక్కడ నిలుపవచ్చు. 

ఈ ఆలయం చాలా లోపలికి ఉండడం వల్ల చాలా మందికి తెలియదు. ప్రభుత్వ బస్, ఆటొ వంటి వాహనాలు కూడా వెల్లవు అందుకే అభివృద్ది కి సరిగ్గా నోచుకోలేదు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్ 

సాయంత్రం : 04:00 నుంచి 07:00 


#Mata ka Mandir  #Machaleshwar  #Manchirevula  #Hyderabad  

Comments