Sri Nalla Pochamma Temple | Aramghar | RajendhraNagar | Hyderabad

 

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం సుమారు 30 సంవత్సరాలు క్రితమే నిర్మించారు అని తెలుస్తుంది. పూర్వం ఈ ఆలయం చాలా చిన్నగా ఉండేది. భక్తులు అందరూ కలిసికట్టుగా ఈ ఆలయాన్ని అభివృద్ది చేసుకున్నారు. ఈ ఆలయంలో కేవలం 25 మంది పట్టే అంతా స్థలంలోనే ఈ ఆలయం ఉంటుంది. 

ఈ ఆలయం హైదరబాద్ లోని ఆరంఘర్ వద్ద పిల్లర్ నెంబర్ 311 కి ఎదురుగా ఈ దేవాలయం ఉన్నది. తెలంగాణ లోని ఈ గ్రామ దేవత కి నోన్ వెజ్ కూడా బలి ఇచ్చే సంప్రదాయం ఇక్కడ ఉన్నది.  ఈ ఆలయం ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. దసరా పండుగ 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

ఈ ఆలయంచూడడానికి చాలా చిన్నగా ఉన్న కూడా భక్తులు మాత్రం చాలా మందే వస్తారు. ఈ ఆలయానికి సరియైన ద్వి చక్ర , త్రీ చక్ర , కార్ ,బస్ వంటి వాటికి ఏ విధమైన పార్కింగ్ సౌకర్యం లేదు. అందుకు గల ప్రధాన కారణం ఈ ఆలయం ప్రధాన రోడ్ కి ఒక్క పక్కన ఉంటుంది. 

దసరా పండుగ రోజున ఇతర ముఖ్యమైన పండుగ రోజులలో రద్దీ కొంచం అధికంగా ఉంటుంది. కొంత మంది ఈ ఆలయంలో అన్నదాన ప్రసాద వితరణ కూడా చేస్తారు. ఆరంఘర్ బస్ స్టాప్ నుంచి ఈ ఆలయం కేవలం 300 మీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. నడుచుకుంటూ కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్

సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు 

#Sri Nalla Pochamma Temple  #Aramghar  #RajendhraNagar  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana