vattepally Venkateshwara Swamy Temple | Falaknama | Hyderabad

 

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి సుమారు 600 సంవత్సరాల కంటే ముందు నుంచే ఈ  దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం పూర్తిగా రాతితో నిర్మించారు. ఆలయ నమూనా మరియు బయట ఉండే ప్రవేశ ద్వారం చూస్తేనే అర్ధం అవుతుంది. 

 ఈ దేవాలయం హైదరాబాద్ లోని హోల్లి జోసెఫ్ స్కూల్ ఎదురుగా ఉంటుంది. ఈ దేవాలయం స్వాగతం పలికే ఆర్చ్ యే చాలా పాతది. ఆలయ ప్రారంభంలోనే తెలిసిపోతుంది మనకి ఈ దేవాలయం చాలా పాతది అని. ఈ దేవాలయాన్ని 13వ శతాబ్దం లో నిర్మించారు అని ఇక్కడి శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. 

ఈ దేవాలయంలో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ గణపతి స్వామి ఆలయం , శివాలయం , దుర్గా దేవి ఆలయం , ఆండాళ్ దేవి ఆలయం , లక్ష్మి దేవి ఆలయం , శ్రీ సీతారాముల స్వామి ఆలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , రావి చెట్టు , జమ్మి చెట్టు కూడా ఉన్నాయి. 

ఈ ఆలయంలో ఉండే జమ్మి చెట్టు చుట్టూ పెళ్లి కానీ ఆడవారు లేదా మగవారు 41 ప్రదక్షిణాలు చేసి స్వామి వారికి తమ మొక్కు గురించి చెపితే తొందరలోనే ఆ కోరిక నెరవేర్తుంది అని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇలా 20 మంది భక్తుల వరకు కోరిక నెరవేరినది. కార్తీక మాసంలో చతుర్థి నాడు శివాలయంలో మరియు వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్ 

సాయంత్రం : 04:00 నుంచి 08:00 


#Vattepally #Venkateshwara Swamy Temple  #Falaknama  #Hyderabad 


Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana