Sri Peddamma Thalli Temple | Mamidipalli | Shamshabad | Hyderabad
ఈ దేవాలయాన్ని నూతనంగా పునః నిర్మించారు. ఈ దేవాలయం చాలా పురాతన దేవాలయం . ఈ దేవాలయం మొదట చాలా చిన్నదిగా ఉండేది. కాలక్రమేణ భక్తులు పెరగడం , అమ్మవారికి ఇక్కడి గ్రామ ప్రజలు అందరూ కలిసి చిన్నగా ఉన్న ఆలయాన్ని పునః నిర్మించుకొని పెద్దిగా కట్టుకున్నారు. ఇక్కడి గ్రామ ప్రజలు ఈ అమ్మవారిని శ్రీ పెద్దమ్మ తల్లిగా కొలుస్తారు.
ఈ దేవాలయం హైదరబాద్ లోని మామిడి పల్లి అనే గ్రామానికి కేవలం 02కి.మీ దూరంలో శంషాబాద్ కి దగ్గరగా ఉంటుంది. విదేశీ పాస్పోర్ట్ సమాచారం ఆఫీసు కి ఎదురుగా ఉంటుంది. ఈ దేవాలయం చాలా చిన్నదిగా ఉన్న కూడా భక్తులు చాలా మందే వస్తారు.
ఈ ఆలాయంలో ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగ చివరి ఆదివారం రోజున ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం , శుక్రవారం , ఆదివారం కొంచం రద్దీగా ఉంటుంది. మిగిలిన సమయంలో అస్సలు రద్దీ యే ఉండధు.
ఈ దేవాలయం ప్రధాన రహదారి మీద ఉండడం వల్ల కేవలం ద్వి చక్ర వాహనాలకి మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉన్నది. త్రీ చక్ర , కార్ , బస్ , భారీ వాహనాలు పార్కింగ్ సౌకర్యం లేదు. ఇక్కడ మొత్తం ఎయిర్పోర్టు కి వెళ్ళే వాహనాలు మరియు సిఆర్‌పిఎఫ్ జవాన్ లు బందోబస్త్ ఎక్కువగా ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 03:30 బ్రేక్
సాయంత్రం : 03:30 నుంచి 07:00
#Sri Peddamma Thalli Temple #Mamidipalli #Shamshabad #Hyderabad

Comments
Post a Comment