Shiva Anjaneya Swamy Devasthanam | Shivarampally Jagir | Rajendhra Nagar | Hyderabad

 

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం పూర్తిగా రాతి తో నిర్మించారు. అందుకోసమే చాలా పాత గుడి ఐన ఇంకా చెక్కు చెదరకుండా పటిష్టంగా ఉన్నది. 

ఈ దేవాలయం హైదరబాద్ లోని రాజేంధ్ర నగర్ మండలం శివరాంపల్లి అనే జాగీర్ లో ఈ దేవాలయం కలదు. 

ఈ దేవాలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ ఆంజనేయ స్వామి కాగా ఈ ఆలయం లో మరియొక్క ప్రధాన దేవత మూర్తి కూడా ఉన్నాడు. ఈ ఆలయంలో 2 ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ గణపతి స్వామి ఆలయం మరియు శివాలయం.

ప్రతి సం || శివరాత్రి రోజున మరియు శ్రీ రామ నవమి , శ్రీ ఆంజనేయ జయంతి రోజులలో గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజులలో ఆన్నదాన ప్రసాద వితరణ కూడా నిర్వహిస్తారు. సోమవారం , శనివారం కొంచం రద్దీ అధికంగా ఉంటుంది. ఇక్కడి అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.  

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 08:00 వరకు 


#Shiva Anjaneya Swamy Devasthanam #Shivarampally Jagir #Rajendhra Nagar #Hyderabad 

Comments