Posts

Showing posts from May, 2025

Sri Lakshmi Ganapathi Temple | Ameerpet | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం. ఈ దేవాలయం తెలంగాణా లోని హైదరాబాద్ వద్ద గల అమీర్ పేట వద్ద బిగ్ బజార్ లైన్ లో శ్రీ గణేష్ నగర్ కాలనీ వద్ద కలదు. పంజాగుట్ట ఆఫీసర్ కాలనీ కి మధ్యలో మెట్రో స్టేషన్ కి చాలా దగ్గరలోనే ఈ ఆలయం ఉంటుంది.  ఈ ఆలయంలో ప్రతి సం || గణపతి నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి. ఈ ఆలయం శ్రీ లక్ష్మీ  గణపతి స్వామి కి విశేష పూజలు చేస్తారు. ప్రతి బుధవారం రోజు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయం చూడడానికి చిన్నగా ఉన్న కూడా ఈ ఆలయం లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి ఆలయాలు చాలా కొని మాత్రమే ఉంటాయి. ఆలయం బయట ద్వి చక్ర వాహనాలకి మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉన్నది. త్రీ , చతుర్ , ఏ ఇతర భారీ వాహనాలకి పార్కింగ్ సౌకర్యం లేదు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 08:00  #Sri Lakshmi Ganapathi Temple  #Ameerpet  #Hyderabad  #Hindu Temples Guide 

Sri Jain Temple | Medchal | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం పురాతన ఆలయం. హైదరాబాద్ లో చూడవలసినా ఆలయలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం పూర్తిగా తెల్ల రాతితో నిర్మించారు. ఈ ఆలయం సికింద్రాబాద్ నుంచి 25 కి.మీ దూరంలోను మరియు నాంపల్లి నుంచి 35కి. మీ దూరంలో ఉన్నది. ఈ ఆలయం మేడ్చల్ రైల్వే స్టేషన్ కి చాలా దగ్గరగా ఉన్నది.  ఈ ఆలయం లో సత్రాలు కూడా ఉన్నాయి. ఏసి రూమ్ కొరకు 700/- మరియు నాన్ ఏసి రూమ్ 500/- 24 గంటలు మాత్రమే. అవి కూడా కేవలం జైన మతస్థులకి మాత్రమే ఇవ్వబడును. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం లేదు. కేవలం అక్కడికి వెళ్ళి రూమ్ ఉంటే మాత్రమే ఇస్తారు. ఈ ఆలయం మొత్తం తెల్ల రాతి తో నిర్మించడం వల్ల చూడగానే మనస్సుకి ఇట్టే ఆకరసిస్తుంది. ఈ ఆలయం లో 4 ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రధాన దేవత మూర్తి శ్రీ జైన ఆలయం. పిల్లల కొరకు పెద్ద గ్రౌండ్ కలదు. చాలా పెద్ద ప్రాంతం లో ఈ ఆలయం నిర్మించారు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 07:00 నుంచి 01:30  మధ్యాన్నం : 01:30 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 08:00  కేవలం సంప్రదాయ దుస్తులలో వస్తే మాత్రమే గుడిలోకి అనుమతి ఇవ్వబడును. శనివారం , ఆదివారం , మరియు ఇతర పండుగల సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది.  #...

Drakshayani Sametha Ramalingeswara Swamy | Medchal | Hyderabad | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం సుమారు 300 సం || కంటే పురాతనమైనది. ఇక్కడ శ్రీ రంగనాయక స్వామి మరియు శివాలయం కలవు. ఈ స్వామి పూర్తి పేరు ద్రాక్షయని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి. ఈ ఆలయం తెలంగాణా లోని హైదరాబాద్ వద్ద గల మేడ్చల్ లో కలదు.  ఈ ఆలయం ఒక చిన కొండ మీద కలదు. ఈ ఆలయం లోనికి చేరుకోవడానికి సుమారు 40 మెట్లు ఎక్కాలి. ఈ ఆలయాన్ని శ్రీ రాముల వారు ప్రతిష్ట చేశారు అని అందుకే ఈ ఆలయానికి శ్రీ రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చినది అని అంటారు. ఈ ఆలయం పక్కనే శ్రీ రంగానాయక స్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయం సుమారు 1200 సం || కంటే పురాతనమైనది. ఈ ఆలయానికి చేరుకోవడానికి సికింద్రాబాద్ నుంచి 229 బస్ ఎక్కి మేడ్చల్ లో దిగితే అక్కడి నుంచి ఆటో లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 01:00  మధ్యాన్నం : 01:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00  #Dakshayani Sametha Ramalingeswara Swamy  #Medchal #Hyderabad  #Telangana 

Sri Sai Mukhtidhamam | Shyam Nagar | Shameerpet | Medchal | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం పూర్తి పేరు శ్రీ సాయి ముక్తిధామం. ఈ ఆలయం మొత్తం రెండు అంతస్థులలో ఉంటుంది. ఈ దేవాలయం తెలంగాణా లోని హైదరాబాద్ వద్ద గల శామీర్ పేట మేడ్చల్ కి మధ్యలో శ్యామ్ నగర్ వద్ద ఉంటుంది.  ఈ ఆలయంలో మొదట శ్రీ గణపతి , శ్రీ ఆంజనేయ స్వామి , శ్రీ కనకదుర్గా దేవి అమ్మవారు , శ్రీ దత్తాత్రేయ స్వామి తరువాత ప్రధాన దేవత మూర్తి దగ్గరకి వెలుతాము. ప్రతి సం || గురు పూర్ణిమ రోజున విశేష పూజలు నిర్వహిస్తారు. ప్రతి గురువారం రోజున రద్దీ కొంచం అధికంగా ఉంటుంది. ప్రతి రోజు ఉదయం కాకడ హారతి మధ్యాన్నం మధ్యాన్న హారతి సాయంత్రం సెజ్ హారతి ఇస్తారు.   ఆలయం కూడా కొంచం చిన్నగానే ఉంటుంది. గురు పౌర్ణమి రోజున అన్నదాన ప్రసాద వితరణ చేస్తారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 01:30  మధ్యాన్నం : 01:30 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 08:00 వరకు  కేవలం సంప్రదాయం దుస్తులలో వచ్చిన వారికి మాత్రమే దర్శనం కి అనుమతి ఇవ్వబడును. ప్రత్యేక పండుగల సమయంలో ఆలయ రద్దీ ని దృష్టిలో ఉంచుకొని దర్శన సమయంలో ఆ రోజులలో మార్పులు ఉంటాయి. భక్తులు సహకరించగలరు. ద్వి చక్ర వాహనాల పార్కింగ...

Shameerpeta Sri Dongala Maisamma Temple | Shameerpeta | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ అమ్మవారి ఆలయంకి పెద్ద చరిత్ర ఉన్నది. ఈ ఆలయం సరిగ్గా తెలంగాణా లోని సికింద్రాబాద్ వద్ద గల శామీర్ పేట ఓ ఆర్ ఆర్ కి ముందే ఉంటుంది. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి సరిగ్గా 18కి. మీ దూరంలోనే ఉంటుంది.  ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఇక్కడ కేవలం ధర్మబద్దమైన కోరికలు నేరవెరతాయి అని భక్తుల నమ్మకం. పూర్వం ఇక్కడ దొంగలు కూడా అమ్మవారి సన్నీది లో మొక్కుకొని దొంగతనాలు చేసే వారు అని తెచ్చిన డబ్బులు కొంచం ధర్మంగా ఖర్చు చేసే వారు తద్వారా ఈ ఆలయానికి దొంగల మైసమ్మ అని పేరు వచ్చింది. కానీ దీనితో మారియొక్క కథ కూడా ప్రాచుర్యంలో ఉన్నది. పూర్వం మోటారు సైకిల్ కూడా లేని సమయంలో అనగా కేవలం ఎడ్ల బండ్లు ఉన్న సమయంలో వేరే ప్రాంతానికి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వెళితే ఆ ఇంటిలో దొంగలు పడకుండా ఉంటుండే అని ఆ ఇంటిని ఈ అమ్మవారు కాపాడుతూ ఉంటుంది అని మరి కొందరి భక్తుల నమ్మకం. ఆదివారం శుక్రవారం రద్దీ అధికంగా ఉంటుంది. ఆషాడ మాసంలో ఇక్కడ అమ్మవారికి చాలా పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పిస్తారు. కరీంనగర్ , సిద్దిపేట , సిరిసిల్ల , గజ్వేల్ నుంచి కూడా భక్తులు వస్తారు. కానీ ఈ ఆలయం మనం అనుకు...

Maddimadugu Hanuman Temple | Telangana | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం తెలంగాణా చివరి గ్రామంలో నల్లమల లో ఉన్నది. సరిగ్గా మద్ది మడుగు అనే గ్రామంలో ఉన్నది. ఈ ఆలయం పూర్తి పేరు మద్ది మడుగు పబ్బతి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం అని  అంటారు. పబ్బతి అంటే ప్రసన్న, శాంతమూర్తి అని అర్ధం.   అమ్రాబాద్ నుంచి 45 కి మీ దూరంలో మరియు ఇప్పలపల్లి నుంచి కేవలం  10 కి. మీ దూరంలో నల్లమల  లోతట్టు, అటవీ ప్రాంతంలో స్వామివారు స్వయంగా వెలిశారు. చైత్ర శుద్ధ పౌర్ణమి, కార్తీక మాసాలలో మరియు శ్రీ హనుమాన్ జయంతి శ్రీ రామనవమి ప్రత్యేక పండుగల సమయంలో  ఇక్కడ స్వామి వారికి  ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.ఇక్కడ స్వామి వారికి బెల్లం , గోధుమ రొట్టెలతో చేసిన ప్రత్యేక ప్రసాదాన్ని నివేదన చేస్తారు. వడ మాల ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ స్వామి వారికి మంగళవారం , శనివరం ప్రత్యేకంగా తమలపాకులతో అర్చన చేస్తారు. ఈ ప్రాంతం హైదరాబాదుకు 185 కి.మీ, మహబూబ్‌నగర్‌కు 145 కి.మీ  అచ్చంపేటకు 70కి.మీ దూరంలో ఉన్నది. ఈ ఆలయం నుంచి శ్రీశైలం కి కేవలం 130 కి. మీ దూరంలోనే ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 01:00  మధ్యాన్నం : 01:00 నుంచి 03...

Sri Ram ghat Hanuman Temple | Gowliguda | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం నిర్మించిన వారు కేవలం ఒకే ఒక వ్యక్తి అంటే నమ్ముతారా? అవును ఈ ఆలయాన్ని నిర్మించినది ఒకే వ్యక్తి.  ఆ రోజు నిర్మించిన ఆలయమే నేడు మీరూ చూస్తున్న ఈ ఆలయం.  ఈ ఆలయాన్ని మొదట రామయ్య  అనే ఇద్దరు 1956 సం || లో ప్రారంభించారు. ఈ ఆలయం అప్పటి మంచినీటి కాలువా లాగా ప్రవహించే మూసి నది పక్కనే ఉన్నది. కొని సం|| ల తరువాత ఆ ఆలయం పూర్తిగా శిధిలావస్థకి చేరుకున్నది. 2018 వ సం || లో మళ్ళీ ఈ ఆలయాన్ని పునః నిర్మించాలి అని సంకల్పంతో ప్రారంభించారు. ఇప్పుడు ఒక పెద్ద శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు. ఈ ఆలయంలో శివాలయం కూడా ఉన్నది. హనుమాన్ జయంతి రోజున మరియు శ్రీ రామనవమి రోజున రద్దీ చాలా అధికంగా ఉంటుంది. హనుమాన్ శోభయాత్ర కూడా ఇక్కడ చాలా బాగా నిర్వహిస్తారు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 08:00  ఈ ఆలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. కేవలం ద్వి చక్ర వాహన పార్కింగ్ మాత్రమే ఉన్నది. దానికి కారణం ఈ ఆలయం ప్రధాన రహదారి మీద ఉండడమే. కేవలం సంప్రదాయ దుస్తులలో మా...

Sri Balaji Temple | Tirmala Arcade | Nimboli Adda | Kachiguda | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని శ్రీ బాలాజీ స్వామిగా కొలుస్తారు అందుకే ఈ ఆలయాన్ని శ్రీ బాలాజీ టెంపుల్ అని పిలుస్తారు. ఈ ఆలయం తెలంగాణాలోని హైదరాబాద్ కాచిగూడ వద్ద గల నింబొడి అడ్డ తిరుమల ఆర్కేడ్ వద్ద ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ప్రధాన రహదారి మీద ఉన్న కూడా చాలా మందికి ఈ ఆలయం గురించి అంతగా తెలియదు. ఈ దేవాలయం హైదరాబాద్ లోని ప్రధాన బస్ స్టాండ్ ఐనటు వంటి మహాత్మా గాంధీ బస్ స్టాండ్ కి మరియు డబీర్ పురా కి మధ్యలో ఈ ఆలయం ఉంటుంది.  ఈ ఆలయం లో మొదట గణపతి స్వామిని దర్శించుకొని ముందుకు వెళితే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. తరువాత శ్రీ దుర్గా దేవి ఆలయం తరువాత శివాలయం ఉంటుంది. ఇక్కడ మన చేతులతో మనమే స్వామి వారికి అభిషేకం చేసుకోవచ్చు.  సంప్రదాయంగా గుడిలో పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వారికి ఈ ఆలయం చక్కటి ప్రాంతం ఈ ఆలయం లో మొదట గణపతి తరువాత శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం తరువాత శివాలయం కూడా ఉన్నాయి. తరువాత ప్రధాన ఆలయం ఐన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశిస్తాము. ఇక్కడ పెళ్లి కోసం పెద్ద మండపం కూడా ఉన్నది. బయటి నుంచి చూస్తే ఈ ఆలయం చిన్నగా కనిపించిన లోపల పె...

Sri Jagadamba Mahankali Temple | Golkonda Fort | Hyderabad | Hindu Temples Guide

Image
  తెలంగాణాలో అది పెద్ద పండుగ బోనాల పండుగ. ఈ పండుగ నెల రోజుల పాటు ఉంటుంది. ఒక పండుగను నెల రోజుల పాటు జరుపుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ఈ పండుగ తెలుగు సం || కాలమాన ప్రకారం ఆషాడ మాసం మొదటి ఆదివారం రోజు ప్రారంభం అయి ఆషాడ మాసం అంతా జరుగుతుంది.  ఈ గోల్కొండ కోట లో మొదట బోనం అమ్మవారికి సమర్పించి తీరిగీ నాలగవ ఆదివారం లేదా నెల లో చివరి ఆదివారంన ఈ పండుగ ముగుస్తుంది. గోల్కొండ మొదట నిర్మించినది మన తెలుగు వారే 11వ శతాబ్దంలో  కాకతీయులు నిర్మించి తరువాత కాలంలో కుతుబ్ ష వారి చేతులలోకి వెళ్ళడం తరువాత మన నాయుడి గారి చేతులలోకి రావడం అతని తరువాత కాలక్రమంలో మళ్ళీ ముస్లింల చేతులలోకి వెళ్ళడం అక్కడి నుంచి వారు ఈ కోటని అభివృద్ది చేసుకోవడం దానిని రాజదానిగా మార్పు చేయడం ఇలా చాలా జరిగినాయి. కానీ అందరి కంటే మొదట ఇక్కడ ఈ అమ్మవారు వెలిసినారు. ఆ కాకతీయు రాజులు అమ్మవారికి గుడి కట్టించి దేశం అంతా సుభిక్షంగా ఉండాలి అని అమ్మవార్లకి పూజలు నిర్వహించారు. ముస్లిం రాజులు కూడా మన అమ్మవార్లకి పూజలు నిర్వహించారు అని ఇక్కడి చరిత్ర. ఆలయ దర్శన సమయం : ఉదయం : 09:00 నుంచి సాయంత్రం 06:00  బోనాల పండుగ సమయంలో రద్దీ చాలా అధిక...

Sri Mavurala Renuka Yellamma Temple | Padmarao Nagar | Secunderabad | Telangnana

Image
  తెలంగాణాలో ఈ అమ్మవారిని అధికంగా కొలిచే వారు ఉన్నారు. కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారం ఈ అమ్మవారు. ఇక్కడి భక్తులు ఈ అమ్మవారిని వల్ల కూతురుగా కూడా భావిస్తారు. ఈ అమ్మవారు పేరు శ్రీ మవురాళ్ళ రేణుక ఎల్లమ్మ తల్లి.  ఈ అమ్మవారి పేరు మీద తెలంగాణా లో చాలా ఆలయాలు ప్రధానంగా హైదరాబాద్ లో అమీర్ పేట వద్ద గల ఎల్లమ్మ తల్లి అమ్మవారు మరియు భువనగిరి వద్ద గల రేణుక ఎల్లమ్మ అమ్మవారు మరియు సికింద్రాబాద్ లో పద్మారావు నగర్ వద్ద ఉన్న శ్రీ మవురాల రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం. ఈ ఆలయం చాలా చిన్నగా ఉంటుంది. ఎటువంటి ద్వి , త్రీ , భారీ వాహనాలు కూడా నిలుపలేరు. ఏవిధమైన పార్కింగ్ సౌకర్యం లేదు. దానికి ప్రధాన కారణం ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం :04:30 నుంచి 07:45  పద్మారావు నగర్ లో ఈ అమ్మవారి పేరు మీద రెండు ఆలయాలు ఉన్నాయి. ఒకటి ప్రారంభంలో ఉంటే రెండు స్కందగిరి ఆలయానికి ప్రారంభంలో ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ కి పక్కనే. ఈ ఆలయానికి కూడా పార్కింగ్ సౌకర్యం లేదు. భక్తులు మాత్రం చాలా మంది వస్తారు. 

Ayyasagar Sri Veerabahdra swamy | Ayyasagar | Amangal | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని అని ఆలయాల వలె కాకుండా కొంచం వేరే విధంగా ఉంటుంది. ఈ ఆలయం రెండు అంతస్థులలో ఉంటుంది. కింద అంత మెట్లు మరియు పైన ఆలయం ఉంటుంది. పై అంతస్థులో ఆలయం అంతా చాలా పాతగా ఉంటుంది. మీరూ ఆలయ బయటి రాతి కట్టడం చూస్తేనే అర్ధం అవుతుంది.  ఈ ఆలయం హైదరాబాద్ కి 70కి. మీ దూరంలో ఉంటుంది. తెలంగాణాలోని అమంగల్ మండలం అయ్యాసాగర్ అనే గ్రామంలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో శ్రీ వీరభద్ర స్వామి తో పాటుగా అమ్మవారు శ్రీ భద్రకాళి దేవి కూడా దర్శించుకోవచ్చు. మొదట శ్రీ గణపతి స్వామి మరియు శ్రీ సుబ్రమణ్య స్వామి , తరువాత ప్రధాన దేవత మూర్తులను దర్శించుకోవచ్చు.  ప్రతి సం || స్వామి వారికి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.  పెళ్లి కానీ వారు , పిల్లలు ఆలస్యం అవుతున్న వారు , రక్త సంబంధ రోగములు ఉన్న వారు స్వామి దీక్ష చెప్పటి ధర్మ బద్దంగా ఉంటే సం || కాలంలో వారి కోరికలు నేరవారుతాయి అని భక్తుల నమ్మకం  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్  సాయంత్రం : 04:00 నుంచి 07:30  స్వామి వారి ఉత్సవాల సమయంలో దసరా , దీపావళి , ఇతర ముఖ్య రోజుల...

Sri Bhavani Shankara Temple | Devuni thota | Bholakpur | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. హైదరాబాద్ లో ఈ ఆలయం చాలా పెద్దగా పార్కింగ్ స్థలన్ని కలిగి ఉన్నది. ఈ ఆలయం హైదరాబాద్ లోని ముషీరాబాద్ వద్ద గల భోళక్ పూర్ అనే ప్రాంతం వద్ద గల దేవుని తోట అనే ప్రాంతం వద్ద ఈ ఆలయం ఉన్నది.  ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శివలింగం మరియు భవానీ అమ్మవారు. ఆ అమ్మవారి పేరు మీదనే ఈ ఆలయం పేరు శ్రీ భవానీ శంకర దేవాలయంగా పిలువబడుతున్నది. ఈ దేవాలయంలో శివలింగం కి మనమే స్వయంగా అభిషేకం చేసుకునే వెసులుబాటు ఉన్నది. కానీ సోమవారం , మాస శివరాత్రి , మహా శివరాత్రి , ఏకాదశి , ఇతర ముఖ్య సమయాలలో మినహా  మనం అభిషేకం చేసుకోవచ్చు. ప్రతి సం మహా శివరాత్రి కి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటి రోజు అనగా శివరాత్రి రోజు ఉదయం నుంచి అర్ధ రాత్రి వరకు అభిషేకాలు నిర్వహించి అర్ధ రాత్రి నుంచి భజనలు మరియు స్వామి వారి కళ్యాణం కూడా నిర్వహిస్తారు. మరుసటి రోజు ఉదయం స్వామి వారికి పూజలు నిర్వహించిన తరువాత అన్నప్రసాద వితరణ కూడా నిర్వహిస్తారు.  ఆలయ దర్శన సమయం :   ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 11:30 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 07:45 వరకు...

Sri Balanjaneya Swamy Temple | Kavadiguda | Hyderabad | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో స్వామి బాలుడి రూపంలో ఉన్నప్పుడు గా దర్శనం ఇస్తారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని కవాడిగూడ అనే ప్రాంతంలో ప్రధాన రహదారి మీదనే ఉంటుంది. టాంక్ బాండ్ నుంచి కవాడిగూడ కి వెళ్ళే మార్గంలో ఈ ఆలయం ఉన్నది.  ఈ ఆలయం పక్కనే మారియొక్క ఆలయం కూడా ఉన్నది. అది కూడా శ్రీ ఆంజనేయ స్వామియా ఆలయం. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి చెట్టు రూపంలో దర్శనం ఇస్తారు. ఒక్కసారి వెళ్ళితే రెండు ఆలయాలు దర్శించుకోవచ్చు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 11:30 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 07:30 వరకు  ఈ ఆలయంలో శ్రీ హనుమాన్ జయంతి , శ్రీ రామ నవమి ఉత్సవాలు కూడా చాలా వైభవంగా జరుగుతాయి. ఈ అలయంలోకి కేవలం సంప్రదాయ దుస్తులలో మాత్రమే అనుమతి ఇవ్వబడును.  #Sri Balanjaneya Swamy Temple #Kavadiguda #Hyderabad #Telangana 

Sri Laxmi Chennakeshava Swamy Temple | Gangapuram | Jadcherla | Mahabubnagar | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవలయాన్ని 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని తెలంగాణా లోని మహాబూబ్ నగర్ జిల్లా లోని జడ్చర్ల నుండి కల్వకుర్తి వెళ్ళే మార్గం మధ్యలో కేవలం 05 కి.మీ దూరంలో మరియు గంగాపురం అనే గ్రామంలో   ఈ పురాతన ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి. ఈ ఆలయంలో దేవత శిల్పం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. స్వామి ని చూడగానే ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతాన్ని పూర్వ కాలంలో మాయపురం, మత్స్యపురం మరియు ధూరితపురం అని కూడా పిలిచేవారు. ప్రస్తుతం గంగాపురం అనే పేరుతో పిలుస్తున్నారు.   ఈ ఆలయం చాళుక్య రాజుల పాలనలో ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా దీనిని కళ్యాణి చాళుక్య రాజు శ్రీ త్రైలోక్య మల్ల సోమేశ్వరుడు (క్రీ.శ. 1042 నుండి 1063 వరకు) నిర్మించాడు.  ఈ ఆలయంలో వీల్ చైర్ సౌకర్యం మరియు ద్వి , త్రీ , మినీ బస్ పార్కింగ్ అందుబాటులో ఉంది. ప్రతి సం || స్వామి వారికి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 11;30 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 07:45...

Sri Parwathi Sametha Ramalingeshwara Swamy | Kandur | Mahabubnagar | Telangana

Image
   ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించడం ఒక అదృష్టంగా భావిస్తారు. అందుకు గల కారణం ఏ శివాలయం దర్శనం ఎన్నో జన్మల అదృష్టం ఉంటే గాని ఈ ఆలయాన్ని దర్శించ లేరు. ఈ ఆలయం తెలంగాణా లోని మహబూబ్ నగర్ జిల్లా కందూర్ అనే గ్రామంలో ఉన్నది. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి కేవలం 75కి.మీ దూరంలోను మరియు కందూర్ ప్రధాన రహదారి నేషనల్ హైవే కి కేవలం 07 కి.మీ దూరంలోనే ఈ ఆలయం ఉన్నది.  అలంపూర్ శ్రీ జోగుళాంబ అమ్మవారు(అష్టదశ శక్తిపీఠలలో 5వ శక్తి పీఠం). కూడా దగ్గరలోనే ఉన్నది. ఈ ఆలయం ఒక కొండ కి అనుకోని పక్కెనే ఒక కోనేరు మరియు కల్ప వృక్షాలుతో ప్రకృతి కి చాలా దగ్గరగా మరియు ప్రశాంతమైన వాతావరణంలో మనస్సుకి ఎంతో హాయిని కలిగిస్తుంది ఈ ఆలయం దర్శనం. ప్రతి సం || స్వామి అమ్మవార్లకి వారికి కళ్యాణం కూడా నిర్వహిస్తారు. ద్వి ,త్రీ , భారీ వాహనాలు కూడా పార్కింగ్ సౌకర్యం కలదు. శివరాత్రికి మరియు దేవి నవరాత్రి కి ఉత్సవాలు నిర్వహిస్తారు.   ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్  సాయంత్రం : 04:00 నుంచి 07:30  #Sri Parwathi Sametha Ramalingeshwara Swamy  #...

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం హైదరాబాద్ లో దర్శించవలసిన ప్రముఖమైన అలయలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం హైదరాబాద్ కి కేవలం 25కి. మీ దూరంలో గల రంగా రెడ్డి జిల్లా శంకరపల్లి అనే గ్రామంలో కలదు. ఈ దేవాలయాన్ని ముందు చిన్నగా నిర్మించిన కూడా ప్రస్తుతం చాలా పెద్దగా ఉంటుంది.  ఈ ఆలయం సరిగ్గా శబరిమల లోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని పోలి ఉంటుంది. అక్కడ ఆడవారికి ప్రవేశం ఉండదు. కానీ ఈ ఆలయంలో ప్రవేశం ఉంటుంది. కానీ అంతరాలయం లోకి మాత్రం ఆడవారికి ప్రవేశం ఉండదు. కేవలం మగ వారు మాత్రమే వెళ్ళవచ్చు. ఈ ఆలయంలో మొదట గణపతి దర్శనం తర్వాత కింద రెండు ఉప ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల దర్శనం తరువాత 18 మెట్లు ఎక్కి పైన ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దర్శనం కొరకు వెళ్ళాలి. స్వామి దర్శనం తరువాత మనస్సు కి చాలా ప్రశాంతత లభించిన అనుభూతి కలుగుతుంది. నవెంబర్ , డిసెంబర్ , జనవరి లో అయ్యప్ప స్వామి భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ 3 నెలల పాటు ఆన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 11:30 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు  జనవరి 1 వ తేదీన మరియు సంక్రాంతి పండుగల సమయంలో మరియ...

Sri Anantha Padmanabha Swamy Temple | Ananthagiri Hills | Vikarabad | Telangana

Image
   ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయం ద్వాపర కాలం నుంచే ఉన్నది అని చరిత్ర. ఈ అలాయాన్ని అనంతగిరి కొండలలో కొలువై ఉన్నారు. ఈ ఆలయం పచ్చటి వాతావరణంలో ఒక కొండ మీద మంచి గాలిలో కొండ గుహలో దర్శనం ఇస్తారు స్వామి. వర్ష కాలం మరియు చలికాలం లో ఈ ఆలయ దర్శనం మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది.  ఈ ఆలయం హైదరాబాద్ నుంచి సుమారు 65కి. మీ దూరంలో ఉన్నది. ఉదయం వెళ్ళితే సాయంత్రంలో తీరిగీ రావచ్చు. తెలంగాణా లోని వికారాబాద్ మండలం అనంతగిరి కొండలలో శ్రీ శ్రీ శ్రీ అనంతపద్మనాభ స్వామి దర్శనం చేసుకోవాలి. కింద కొండ గుహలో వెళితే స్వామి దర్శనం చేసుకుంటే ఏదో తెలియని ఒక సంతృప్తి తో బయటికి వస్తాం. వైకుంఠ ఏకాదశి రోజు రద్దీ చాలా అధికంగా ఉంటుంది. ఇక్కడ స్వామి వారికి ప్రతి సం || ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడ దగ్గరలోనే ఒక కోనేరు ఉన్నది. తప్పకుండా దానిని కూడా దర్శించాలి. అది కోనేరు మాత్రమే కాదు మరి ఒక ఆలయం.  ఈ ఆలయం పూర్తిగా కొండ మీద ఉండడం వల్ల చిన్న పిల్లలకి నీరు మరియు ఇతర చిరు తిండ్లు వంటివి ముందే తీసుకొని వెళ్ళడం మంచిది. ఈ ఆలయంలో ప్రసాదం కూడా అమ్ముతారు. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా ప్రాధాన్యత ఇస్తారు.  ఆలయ దర్శన స...

Kolanupaka Someshwara Swamy temple | Yadadri Bhuvanagiri | Telangana

Image
    ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దం లో కాకతీయుల రాజుల కాలంనాటిది. ఈ ఆలయాన్ని అప్పుడు నిర్మించారు. గణపతి ఉత్సవాలు , శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగేవి.  ఇంతటి పురాతన మరియు ఘనమైన చరిత్ర కలిగిన ఆలయం మన తెలంగాణా లో ఉండడం మన అందరికీ గర్వ కారణం. ఈ ఆలయం తెలంగాణా లోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక అనే గ్రామంలో ఉన్నది. ఈ ఆలయం చాలా పురతనమైనది కావడం వల్ల మరియు పాత ప్రభుత్వలు ఈ ఆలయ అభివృద్ది గురించి సమీక్షలు చేయక పోవడం , ప్రజల నుంచి కూడా అంతగా స్పందన లేకపోవడం వల్ల ఇంతటి మహిమ గలిగిన ఆలయం నేడు శిధిలావస్థకి చేరుకున్నది. ఈ ఆలయంలో ఒక కోటి కి పైగా శివలింగాలు ఉన్నాయి. వీటిని రక్షించుకోవడం మన అందరి భాద్యత.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00  #Kolanupaka Someshwara Swamy temple #Yadadri Bhuvanagiri  #Telangana

Sri Jagdish Mandir | Lower Tank Bund | Kavadiguda | Hyderabad | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయంలలో ఈ దేవాలయం కూడా ఒకటి. ఈ ఆలయానికి చాలా ఘనమైన చరిత్ర ఉన్నాది. ఈ దేవలయం హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న హుసేన్ సాగర్ కి లోవర్ టాంక్ బాండ్ వద్ద కలదు. చాలా మందికి ఈ ఆలయం ఒకటి ఉన్నది అని తెలియదు. దానికి గల కారణం ఈ ఆలయం తక్కువగా అభివృద్ది చెందడం.  ఇప్పుడు ఈ ఆలయాన్ని పునః నిర్మాణం చేస్తున్నారు. మొత్తం లోపల పాలరాత్రి తో నిర్మిస్తునారు. ఉదయం మరియు సంధ్య సాయంత్రం సమయంలో ఈ ఆలయ దర్శనం మనస్సుకి ఎంతో హాయిని ఇస్తుంది. 1651 సం || లో మహారాణా జగత్ సింగ్ 1 స్థాపించబడిన ఆలయం ప్రధానమైన ఆలయం ఉదయ్ పూర్ లో ఉన్నది. అలాంటి ఆలయమే ఈ  ఆలయం. ఈ ఆలయాన్ని ఇండో - ఆర్యన్ నిర్మాణ శైలిలో ఉంటుంది. ఇక్కడ ప్రధాన దేవత మూర్తి శ్రీ వేంకటేశ్వర స్వామి. వారు మన స్వామిని శ్రీ జగదీష్ మందిర్ అనే పేరు తో కొలుస్తారు. ఏ విధంగా ఐతే ముంబైలో శ్రీ వేంకటేశ్వర స్వామిని బాలాజీ అని పేరు తో పూజిస్తారో అదే విధంగా ఇక్కడ కూడా స్వామి ని పూజిస్తారు.  వైకుంఠ ఏకాదశి మరియు శ్రీ రామనవమి రోజున రద్దీ కొంచం ఎక్కువగ ఉంటుంది. మిగిలిన సమయంలో తక్కువ.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం :...

Sankat Mochan Hanuman Temple | Kavadiguda | Hyderabad | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం చాలా విశేషాలతో కూడుకొని ఉన్నది. ఈ దేవాలయం హైదరాబాద్ లోని కవాడిగూడ వద్ద కలదు. ఈ ఆలయానికి సరియైన ద్వి , త్రీయ వాహనాల పార్కింగ్ సౌకర్యం కూడా లేదు. దానికి గల కారణం ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉంటుంది.  ఈ ఆలయం లో ఎక్కడ లేని విధంగా శ్రీ ఆంజనేయ స్వామి మరియు శ్రీ గణపతి స్వామి దర్శనం ఇస్తారు. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభూ. ఎవ్వరూ ఈ స్వామి ఇక్కడ ప్రతిష్ట చేయలేదు. ఈ ఆలయంలో స్వామి ఒక చెట్టు రూపంలో దర్శనం ఇస్తారు. మొదట ఈ ఆలయం చాలా చిన్నగా ఉంటుంది. స్వామిని దర్శించే భక్తులు దిన దిననాభివృద్ది చెందడం వల్ల ఇప్పుడు ఆలయం కొంచం పెద్దగా నిర్మించడం జరిగినది.  ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి తో పాటుగా  శ్రీ గణపతి స్వామి , శివలింగం , చెట్టు కింద హనుమాన్ ఆలయం కూడా ఉన్నది. ఆలయం చిన్నగా ఉన్న కూడా శక్తి మాత్రం చాల ఎక్కువ.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00  శ్రీ రామ నవమి , గణపతి నవరాత్రులు , మహా శివరాత్రి రోజులలో రద్దీ చాలా అధికంగా ఉంటుంది.  #Sankat Mochan Hanuman...

ASHTA JYOTIRLINGA SHRAVAN SPECIAL YATRA (WZBG50) | IRCTC | Hindu Temples Guide

Image
  ఇప్పుడు అందరూ కేవలం బడ్జెట్ లో మాత్రమే ప్రయాణించాలి అని అనుకుంటున్నారు. ఎక్కువ ఖర్చు లేకుండా అతి తక్కువ ఖర్చు తో ప్రయాణించాలీ అని అనుకునే వారికి ఐఆర్సిటిసి వారు శుభవార్త చెప్పరు. అలాంటి వారి కోసమే ఈ  అష్ట జ్యోతిర్లింగ శ్రావణ స్పెషల్ యాత్ర.  ప్రయాణం సమయం : 12 రాత్రులు / 13 పగలు.   దర్శించే ప్రాంతాలు : ద్వారకా , సోమనాథ్ , మహాకాళేశ్వర్ , ఓంకారేశ్వర్ , త్రయంబకేశ్వర్ , గృష్ణేశ్వర్ , పర్లీ వైజనాథ్ , మల్లికార్జున    రైలు పేరు : అష్టజ్యోతిర్లింగ శ్రావణ స్పెషల్ భారత్ గౌరవ టూరిస్ట్ ట్రైన్ SL, 2AC & 3AC. టికెట్ ప్రారంభ ధర : 23880/- ఒక్కరికీ ప్రారంభ ధర. ఇతర అధిక ధర సీట్ లు కూడా కలవు.  టూర్ కోడ్ : (WZBG50) ప్రయాణ తేదీ 05/08/2025  దర్శించే ప్రాంతాల పేర్లు :  మడ్గ్వాన్ - ద్వారకా వద్ద గల నాగేశ్వర్ , సోమనాథ్,   ఉజ్జయిన్ వద్ద గల మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం, నాసిక్ వద్ద గల త్రయంబకేశ్వర్ , ఔరంగాబాద్ వద్ద గల గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. పర్భణీ/ పర్లీ వైద్యనాథ , మార్కపూర్ రైల్వే స్టేషన్ దగ్గర లో గల శ్రీశైల జ్యోతిర్లింగం...

AAI MATA TEMPLE | JEEDIMETLA | Hyderabad | Telangana

Image
  ఈ ఆలయం చాలా ప్రముఖమైన ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ లో షాపూర్ వద్ద గల  భాగ్యలక్ష్మీ కాలనీ వద్ద కలదు. ఈ ఆలయం పూర్తిగా ఉత్తర భారతదేశం ఆలయాల నమూనా వలె ఉంటుంది.  ఈ ఆలయం రాజస్థాన్ వాళ్ళు అక్కడ ఆచారం ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఆలయం పూర్తిగా ఎర్ర రాయి తో నిర్మించారు. ఢిల్లీ లోని ఎర్ర కోట వలె ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శిస్తే మనం కూడా రాజస్థాన్ లో ఉన్నామ అనే అనుభూతిని కలిగిస్తుంది. లోపల ఆలయం కూడా తెల్లటి మార్బల్ బండాలతో చాలా పరిశుభ్రంగా మనస్సు కి ఎంతో ఆహ్లాదం కలిగించే విధంగా అంతరాలయం ఉంటుంది.  ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ ఆయీ మాతా అమ్మవారు. ఇక్కడ ఆలయం రెండు అంతస్థులలో ఉంటుంది. కింద అంతా వంట శాలా పైన మొదటి అంతస్థులలో అమ్మవారు మరియు పరివార దేవతలు ఉప ఆలయాలు , ఉత్సవ మూర్తులు ఇలా చాలా ఉన్నాయి.  ఈ ఆలయంలో దసరా సమయంలో మరియు ఇతర పండుగల రద్దీ అధికంగా ఉంటుంది. రాజస్థానీ వల్ల ప్రత్యేక పర్వరోజులలో ఆలయాన్ని రంగు రంగు ఎలెట్రిక్ కాంతుల వెలుగులతో ఆలయం మరికొంత అద్భుతంగా కనిపిస్తుంది.  గూగుల్ లో కూడా ఈ ఆలయం మ్యాప్ ఉన్నది. ఆలయంని ద్వి మరియు త్రీ చక్ర వాహనాల పార్కింగ్ కి మ...

Sri Sri Sri Laxmi Narasimha Swamy Temple | Narsing Mandir Road | Shamshabad | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం ఇక్కడ ఉన్నది అని చాలా మందికి తెలియదు. డానికి గల కారణం ఈ ఆలయానికి సరియైన ప్రవేశ ద్వారం మరియు ఇండ్ల మధ్య లో ఉండడం వల్ల సరిగ్గా గమనించకుండానే వెళ్ళిపోవడం వల్ల సరియైన గుర్తింపు లభించలేదు.  ఈ ఆలయం లోని ప్రధాన దేవత మూర్తి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి. ఇక్కడ స్వామి ప్రత్యేకంగా ఉత్సవ మూర్తిని ఉయ్యాల లో ఉంచి పూజ చేసే విధానం ఇక్కడ ఉన్నది. ఈ ఆలయం లోకి ప్రవవేశించగానే మన పూర్వీకుల ఆలయ సంపదకి మనం వారసులం అని తెలుస్తుంది. దానికి గల కారణం ఇక్కడ రాతితో నిర్మించిన శిలాల సౌందర్యం. ఈ ఆలయం నిర్మించి ఇప్పటికి సుమారు 500 సం || కంటే పూర్వం నుంచే ఉన్నది. ఇంతటి శిల్ప కాలతో ఉన్న ఆలయాన్ని రక్షించుకోవడం మన అందరి భాద్యత.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 07:30  #Sri Sri Sri Laxmi Narasimha Swamy Temple  #Narsing Mandir Road  #Shamshabad  #Hyderabad 

Sri Venkateshwara Swamy Temple | Tukkuguda | Ranga Reddy | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి సుమారు 3700 సం || నుంచి ఉన్నది. ఈ ఆలయం హైదరాబాద్ లోని రంగారెడ్డి తుక్కుగూడ వద్ద గల శ్రీ నగర్ గ్రామం లో ఉన్నది.  ఈ ఆలయంలో స్వామి శ్రీ వేంకటేశ్వర స్వామి మరియు శివాలయం కూడా ఒక్కటే పీఠం మీద కలసి ఉంటుంది. ఈ స్వామి స్వయంభూ స్వామి. ఎవ్వరూ ప్రతిష్టించలేదు. స్వామి స్వయంభూ. ఇక్కడ కేవలం ధర్మ బద్దమైన కోరికలు మాత్రమే తప్పకుండా నెరవేరుతాయి అని ఇక్కడ భక్తుల నమ్మకం. డానికి కూడా కొన్ని షరతులు ఉన్నాయి అని అంటున్నారు. మండలం పాటు అత్యంత భక్తితో , స్వామి మీద నమ్మకంతో , ధర్మంగా ఉంటూ , కేవలం సాత్వికమైన శాఖహర భోజనం చేస్తూ మండల దీక్ష  చేసి స్వామి వారికి ఆ మొక్కు సమార్పిస్తే అప్పుడు ఆ కోరికలు ధర్మం ఐనవి తిరుతాయి అని ఇక్కడ భక్తుల నమ్మకం.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 08:00  #Sri Venkateshwara Swamy Temple  #Tukkuguda  #Ranga Reddy  #Hyderabad

DR. AMBEDKAR YATRA WITH PANCH(05) JYOTIRLINGA DARSHAN (SCZBG43) | IRCTC | Hindu Temples Guide

Image
  ఇప్పుడు అందరూ కేవలం అంబేద్కర్ యాత్ర పంచ జ్యోతిర్లింగ దర్శనం (SCZBG43) ప్రయాణం సమయం : 08 రాత్రులు / 09 పగలు  దర్శించే ప్రాంతాలు : దీక్షభూమి , మహాకాళేశ్వర్ , ఓంకారేశ్వర్ , త్రయంబకేశ్వర్, భీమశంకర్ , ఘృష్ణేవర్ , జన్మభూమి ,  రైలు పేరు : అంబేద్కర్ యాత్ర టూర్ బై భారత్ గౌరవ టూరిస్ట్ ట్రైన్ 2 ac & 3 ac.  టికెట్ ప్రారంభ ధర : 14700/- ఒక్కరికీ.  టూర్ ప్రధానాంశాలు : టూర్ కోడ్ : SCZBG43 ప్రయాణ తేదీ 05/07/2025  దర్శించే ప్రాంతాల పేర్లు :  నాగపూర్ వద్ద గల దీక్షభూమి , ఉజ్జయిన్ వద్ద గల మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మ్ హో వద్ద గల జన్మ భూమి , నాసిక్ వద్ద గల త్రయంబకేశ్వర్ , పూణే వద్ద గల భీమశంకర్ జ్యోతిర్లింగం ఔరంగాబాద్ వద్ద గల గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ) పూర్తి సీట్లు : 718  అందులో (SL:460, 3AC:206, 2AC: 52) పికప్ మరియు డ్రాప్ పాయింట్లు : సికింద్రాబాద్ , కామారెడ్డి , నిజామాబాద్ , ధర్మబాద్ , ముదఖేడ్ , నాందేడ్ & పూర్ణ.  ఏజ్ ప్రకారం గా టూర్ టికెట్ ధరలు  05-11 సం || పిల్లలకి  ఎకానమీ ధర 13700/-    -  14700/- స...