Sri Laxmi Chennakeshava Swamy Temple | Gangapuram | Jadcherla | Mahabubnagar | Telangana

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవలయాన్ని 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని తెలంగాణా లోని మహాబూబ్ నగర్ జిల్లా లోని జడ్చర్ల నుండి కల్వకుర్తి వెళ్ళే మార్గం మధ్యలో కేవలం 05 కి.మీ దూరంలో మరియు గంగాపురం అనే గ్రామంలో   ఈ పురాతన ఆలయం ఉన్నది.

ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి. ఈ ఆలయంలో దేవత శిల్పం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. స్వామి ని చూడగానే ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతాన్ని పూర్వ కాలంలో మాయపురం, మత్స్యపురం మరియు ధూరితపురం అని కూడా పిలిచేవారు. ప్రస్తుతం గంగాపురం అనే పేరుతో పిలుస్తున్నారు.  

ఈ ఆలయం చాళుక్య రాజుల పాలనలో ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా దీనిని కళ్యాణి చాళుక్య రాజు శ్రీ త్రైలోక్య మల్ల సోమేశ్వరుడు (క్రీ.శ. 1042 నుండి 1063 వరకు) నిర్మించాడు.  ఈ ఆలయంలో వీల్ చైర్ సౌకర్యం మరియు ద్వి , త్రీ , మినీ బస్ పార్కింగ్ అందుబాటులో ఉంది. ప్రతి సం || స్వామి వారికి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 11:30 

మధ్యాన్నం : 11;30 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 07:45 వరకు 


#Sri Laxmi Chennakeshava Swamy Temple  #Gangapuram  #Jadcherla  #Mahabubnagar  #Telangana 


Comments