AAI MATA TEMPLE | JEEDIMETLA | Hyderabad | Telangana

 


ఈ ఆలయం చాలా ప్రముఖమైన ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ లో షాపూర్ వద్ద గల  భాగ్యలక్ష్మీ కాలనీ వద్ద కలదు. ఈ ఆలయం పూర్తిగా ఉత్తర భారతదేశం ఆలయాల నమూనా వలె ఉంటుంది. 

ఈ ఆలయం రాజస్థాన్ వాళ్ళు అక్కడ ఆచారం ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఆలయం పూర్తిగా ఎర్ర రాయి తో నిర్మించారు. ఢిల్లీ లోని ఎర్ర కోట వలె ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శిస్తే మనం కూడా రాజస్థాన్ లో ఉన్నామ అనే అనుభూతిని కలిగిస్తుంది. లోపల ఆలయం కూడా తెల్లటి మార్బల్ బండాలతో చాలా పరిశుభ్రంగా మనస్సు కి ఎంతో ఆహ్లాదం కలిగించే విధంగా అంతరాలయం ఉంటుంది. 

ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ ఆయీ మాతా అమ్మవారు. ఇక్కడ ఆలయం రెండు అంతస్థులలో ఉంటుంది. కింద అంతా వంట శాలా పైన మొదటి అంతస్థులలో అమ్మవారు మరియు పరివార దేవతలు ఉప ఆలయాలు , ఉత్సవ మూర్తులు ఇలా చాలా ఉన్నాయి. 

ఈ ఆలయంలో దసరా సమయంలో మరియు ఇతర పండుగల రద్దీ అధికంగా ఉంటుంది. రాజస్థానీ వల్ల ప్రత్యేక పర్వరోజులలో ఆలయాన్ని రంగు రంగు ఎలెట్రిక్ కాంతుల వెలుగులతో ఆలయం మరికొంత అద్భుతంగా కనిపిస్తుంది.  గూగుల్ లో కూడా ఈ ఆలయం మ్యాప్ ఉన్నది. ఆలయంని ద్వి మరియు త్రీ చక్ర వాహనాల పార్కింగ్ కి మాత్రమే స్థలం ఉన్నది. పెద్ద పెద్ద వాహనాల పార్కింగ్ సౌకర్యం లేదు. 

ఇక్కడ మొదట గణపతి స్వామి దర్శనం చేసుకోవాలి. తరువాత సంతోషి మాతా  దర్శనం తరువాత ప్రధాన దేవత ఐన ఆయీ మాతా అమ్మవారి దర్శనం చేసుకోవాలి. పక్కనే శ్రీ రాధా కృష్ణ ఆలయం కూడా ఉన్నది. వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారికి ప్రత్యేక అలంకరణలు నిర్వహిస్తారు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 12:30

మధ్యాన్నం : 12:30 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు 


#AAI MATA TEMPLE #JEEDIMETLA #Hyderabad #Telangana 

--

#Dattapeetam St #Bhagya Lakshmi Colony #Jeedimetla #Hyderabad #Telangana #500055

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana