Sri Balaji Temple | Tirmala Arcade | Nimboli Adda | Kachiguda | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని శ్రీ బాలాజీ స్వామిగా కొలుస్తారు అందుకే ఈ ఆలయాన్ని శ్రీ బాలాజీ టెంపుల్ అని పిలుస్తారు. ఈ ఆలయం తెలంగాణాలోని హైదరాబాద్ కాచిగూడ వద్ద గల నింబొడి అడ్డ తిరుమల ఆర్కేడ్ వద్ద ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ప్రధాన రహదారి మీద ఉన్న కూడా చాలా మందికి ఈ ఆలయం గురించి అంతగా తెలియదు. ఈ దేవాలయం హైదరాబాద్ లోని ప్రధాన బస్ స్టాండ్ ఐనటు వంటి మహాత్మా గాంధీ బస్ స్టాండ్ కి మరియు డబీర్ పురా కి మధ్యలో ఈ ఆలయం ఉంటుంది.
ఈ ఆలయం లో మొదట గణపతి స్వామిని దర్శించుకొని ముందుకు వెళితే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. తరువాత శ్రీ దుర్గా దేవి ఆలయం తరువాత శివాలయం ఉంటుంది. ఇక్కడ మన చేతులతో మనమే స్వామి వారికి అభిషేకం చేసుకోవచ్చు. సంప్రదాయంగా గుడిలో పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వారికి ఈ ఆలయం చక్కటి ప్రాంతం ఈ ఆలయం లో మొదట గణపతి తరువాత శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం తరువాత శివాలయం కూడా ఉన్నాయి. తరువాత ప్రధాన ఆలయం ఐన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశిస్తాము. ఇక్కడ పెళ్లి కోసం పెద్ద మండపం కూడా ఉన్నది. బయటి నుంచి చూస్తే ఈ ఆలయం చిన్నగా కనిపించిన లోపల పెద్దగానే ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:30 నుంచి 11:30
మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 07:30 వరకు
వైకుంఠ ఏకాదశి రోజున రద్దీ చాలా అధికంగా ఉంటుంది. కేవలం సంప్రదాయ దుస్తులలో మాత్రమే అనుమతి ఇవ్వబడును.
#Sri Balaji Temple #Tirmala Arcade #Nimboli Adda #Kachiguda #Hindu Temples Guide

Comments
Post a Comment