Sri Jagadamba Mahankali Temple | Golkonda Fort | Hyderabad | Hindu Temples Guide
తెలంగాణాలో అది పెద్ద పండుగ బోనాల పండుగ. ఈ పండుగ నెల రోజుల పాటు ఉంటుంది. ఒక పండుగను నెల రోజుల పాటు జరుపుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ఈ పండుగ తెలుగు సం || కాలమాన ప్రకారం ఆషాడ మాసం మొదటి ఆదివారం రోజు ప్రారంభం అయి ఆషాడ మాసం అంతా జరుగుతుంది.
ఈ గోల్కొండ కోట లో మొదట బోనం అమ్మవారికి సమర్పించి తీరిగీ నాలగవ ఆదివారం లేదా నెల లో చివరి ఆదివారంన ఈ పండుగ ముగుస్తుంది. గోల్కొండ మొదట నిర్మించినది మన తెలుగు వారే 11వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించి తరువాత కాలంలో కుతుబ్ ష వారి చేతులలోకి వెళ్ళడం తరువాత మన నాయుడి గారి చేతులలోకి రావడం అతని తరువాత కాలక్రమంలో మళ్ళీ ముస్లింల చేతులలోకి వెళ్ళడం అక్కడి నుంచి వారు ఈ కోటని అభివృద్ది చేసుకోవడం దానిని రాజదానిగా మార్పు చేయడం ఇలా చాలా జరిగినాయి. కానీ అందరి కంటే మొదట ఇక్కడ ఈ అమ్మవారు వెలిసినారు. ఆ కాకతీయు రాజులు అమ్మవారికి గుడి కట్టించి దేశం అంతా సుభిక్షంగా ఉండాలి అని అమ్మవార్లకి పూజలు నిర్వహించారు. ముస్లిం రాజులు కూడా మన అమ్మవార్లకి పూజలు నిర్వహించారు అని ఇక్కడి చరిత్ర.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 09:00 నుంచి సాయంత్రం 06:00
బోనాల పండుగ సమయంలో రద్దీ చాలా అధికంగా ఉంటుంది. దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పట్టవచ్చు. అమ్మవారికి బోనాల సమర్పించే భక్తుల కొరకు ప్రత్యేక క్యూ లైన్ లు ఏర్పాటు చేస్తారు. అమ్మవారి తమ్ములు అనగా పోతరాజులు వివిధ వేషాదరణలో కనిపిస్తూ ఉంటారు.పూర్వం కాలం నుంచి ఈ పోతరాజులు కేవలం ఒక సంప్రదాయం ప్రకారం వస్తు ఉండే వారు. కానీ ఇప్పుడు ఎవరు పడితే ఎవరు వారు ఈ పోతారాజుల వేషం వేస్తున్నారు. ఈ పండుగ ని చూడడానికి వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ దేశాల ప్రజలు కూడా ఈ ఉత్సవాలలో కూడా పాల్గొంటారు. దాదాపు 20 నుంచి 25 లక్షల మంది ఈ పండుగలో పాల్గొంటారు.

Comments
Post a Comment