Shameerpeta Sri Dongala Maisamma Temple | Shameerpeta | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ అమ్మవారి ఆలయంకి పెద్ద చరిత్ర ఉన్నది. ఈ ఆలయం సరిగ్గా తెలంగాణా లోని సికింద్రాబాద్ వద్ద గల శామీర్ పేట ఓ ఆర్ ఆర్ కి ముందే ఉంటుంది. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి సరిగ్గా 18కి. మీ దూరంలోనే ఉంటుంది.
ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఇక్కడ కేవలం ధర్మబద్దమైన కోరికలు నేరవెరతాయి అని భక్తుల నమ్మకం. పూర్వం ఇక్కడ దొంగలు కూడా అమ్మవారి సన్నీది లో మొక్కుకొని దొంగతనాలు చేసే వారు అని తెచ్చిన డబ్బులు కొంచం ధర్మంగా ఖర్చు చేసే వారు తద్వారా ఈ ఆలయానికి దొంగల మైసమ్మ అని పేరు వచ్చింది. కానీ దీనితో మారియొక్క కథ కూడా ప్రాచుర్యంలో ఉన్నది. పూర్వం మోటారు సైకిల్ కూడా లేని సమయంలో అనగా కేవలం ఎడ్ల బండ్లు ఉన్న సమయంలో వేరే ప్రాంతానికి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వెళితే ఆ ఇంటిలో దొంగలు పడకుండా ఉంటుండే అని ఆ ఇంటిని ఈ అమ్మవారు కాపాడుతూ ఉంటుంది అని మరి కొందరి భక్తుల నమ్మకం. ఆదివారం శుక్రవారం రద్దీ అధికంగా ఉంటుంది. ఆషాడ మాసంలో ఇక్కడ అమ్మవారికి చాలా పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పిస్తారు. కరీంనగర్ , సిద్దిపేట , సిరిసిల్ల , గజ్వేల్ నుంచి కూడా భక్తులు వస్తారు. కానీ ఈ ఆలయం మనం అనుకున్నత పెద్దగా ఉండదు. చాలా చిన్న ఆలయం కానీ అమ్మవారి శక్తి అమోఘం. ప్రతి ఆదివారం ఇక్కడ అమ్మవారికి నాన్ వెజ్ నైవేద్యం కు కూడా సమర్పిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 02:00
మధ్యాన్నం : 02:00 నుంచి 03:30 బ్రేక్
సాయంత్రం : 03:30 నుంచి 06:30 వరకే
ఈ ఆలయం ప్రధాన రోడ్డు మీద ఉండడం వల్ల చాలా తొందరనే మూసి వేస్తారు. పూర్వం ఈ ప్రాంతం అంతా అడవి ప్రాంతం. అందువల్ల ఆలయ దర్శన సమయం ఇప్పటికి అదే ఫాలో అవుతున్నారు. అందరూ వారి వారి వ్యక్తిగత వాహనాలలో వస్తారు. బస్ సౌకర్యం ఉన్న బస్ స్టాండ్ లేదు. ఆలయం వెనుక చాలా పెద్ద స్థలం ఉన్నది.
#Shameerpeta #Sri Dongala Maisamma Temple #Shameerpeta #Hyderabad

Comments
Post a Comment