Sri Bhavani Shankara Temple | Devuni thota | Bholakpur | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. హైదరాబాద్ లో ఈ ఆలయం చాలా పెద్దగా పార్కింగ్ స్థలన్ని కలిగి ఉన్నది. ఈ ఆలయం హైదరాబాద్ లోని ముషీరాబాద్ వద్ద గల భోళక్ పూర్ అనే ప్రాంతం వద్ద గల దేవుని తోట అనే ప్రాంతం వద్ద ఈ ఆలయం ఉన్నది.
ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శివలింగం మరియు భవానీ అమ్మవారు. ఆ అమ్మవారి పేరు మీదనే ఈ ఆలయం పేరు శ్రీ భవానీ శంకర దేవాలయంగా పిలువబడుతున్నది. ఈ దేవాలయంలో శివలింగం కి మనమే స్వయంగా అభిషేకం చేసుకునే వెసులుబాటు ఉన్నది. కానీ సోమవారం , మాస శివరాత్రి , మహా శివరాత్రి , ఏకాదశి , ఇతర ముఖ్య సమయాలలో మినహా మనం అభిషేకం చేసుకోవచ్చు. ప్రతి సం మహా శివరాత్రి కి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటి రోజు అనగా శివరాత్రి రోజు ఉదయం నుంచి అర్ధ రాత్రి వరకు అభిషేకాలు నిర్వహించి అర్ధ రాత్రి నుంచి భజనలు మరియు స్వామి వారి కళ్యాణం కూడా నిర్వహిస్తారు. మరుసటి రోజు ఉదయం స్వామి వారికి పూజలు నిర్వహించిన తరువాత అన్నప్రసాద వితరణ కూడా నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 11:30
మధ్యాన్నం : 11:30 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 07:45 వరకు
ఆలయ దర్శనం సమయం వివిధ ప్రత్యేక పండుగల సమయంలలో మరియు ఇతర ముఖ్య రోజులలో ఆలయ దర్శన సమయంలలో మార్పులు ఉంటాయి భక్తులు గమనించగలరు. మరియు కేవలం సంప్రదాయ దుస్తులలో మాత్రమే అనుమతి ఇవ్వబడును.
#Sri Bhavani Shankara Temple #Devuni thota #Bholakpur #Hyderabad

Comments
Post a Comment