Sri Anantha Padmanabha Swamy Temple | Ananthagiri Hills | Vikarabad | Telangana
ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయం ద్వాపర కాలం నుంచే ఉన్నది అని చరిత్ర. ఈ అలాయాన్ని అనంతగిరి కొండలలో కొలువై ఉన్నారు. ఈ ఆలయం పచ్చటి వాతావరణంలో ఒక కొండ మీద మంచి గాలిలో కొండ గుహలో దర్శనం ఇస్తారు స్వామి. వర్ష కాలం మరియు చలికాలం లో ఈ ఆలయ దర్శనం మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది.
ఈ ఆలయం హైదరాబాద్ నుంచి సుమారు 65కి. మీ దూరంలో ఉన్నది. ఉదయం వెళ్ళితే సాయంత్రంలో తీరిగీ రావచ్చు. తెలంగాణా లోని వికారాబాద్ మండలం అనంతగిరి కొండలలో శ్రీ శ్రీ శ్రీ అనంతపద్మనాభ స్వామి దర్శనం చేసుకోవాలి. కింద కొండ గుహలో వెళితే స్వామి దర్శనం చేసుకుంటే ఏదో తెలియని ఒక సంతృప్తి తో బయటికి వస్తాం. వైకుంఠ ఏకాదశి రోజు రద్దీ చాలా అధికంగా ఉంటుంది. ఇక్కడ స్వామి వారికి ప్రతి సం || ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడ దగ్గరలోనే ఒక కోనేరు ఉన్నది. తప్పకుండా దానిని కూడా దర్శించాలి. అది కోనేరు మాత్రమే కాదు మరి ఒక ఆలయం.
ఈ ఆలయం పూర్తిగా కొండ మీద ఉండడం వల్ల చిన్న పిల్లలకి నీరు మరియు ఇతర చిరు తిండ్లు వంటివి ముందే తీసుకొని వెళ్ళడం మంచిది. ఈ ఆలయంలో ప్రసాదం కూడా అమ్ముతారు. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా ప్రాధాన్యత ఇస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 01:00
మధ్యాన్నం : 01:00 నుంచి 03:30 బ్రేక్
సాయంత్రం : 03:30 నుంచి 08:00
#Sri Anantha Padmanabha Swamy Temple #Ananthagiri Hills #Vikarabad #Telangana
Comments
Post a Comment