Sri Lakshmi Ganapathi Temple | Ameerpet | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం. ఈ దేవాలయం తెలంగాణా లోని హైదరాబాద్ వద్ద గల అమీర్ పేట వద్ద బిగ్ బజార్ లైన్ లో శ్రీ గణేష్ నగర్ కాలనీ వద్ద కలదు. పంజాగుట్ట ఆఫీసర్ కాలనీ కి మధ్యలో మెట్రో స్టేషన్ కి చాలా దగ్గరలోనే ఈ ఆలయం ఉంటుంది.
ఈ ఆలయంలో ప్రతి సం || గణపతి నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి. ఈ ఆలయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి కి విశేష పూజలు చేస్తారు. ప్రతి బుధవారం రోజు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయం చూడడానికి చిన్నగా ఉన్న కూడా ఈ ఆలయం లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి ఆలయాలు చాలా కొని మాత్రమే ఉంటాయి. ఆలయం బయట ద్వి చక్ర వాహనాలకి మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉన్నది. త్రీ , చతుర్ , ఏ ఇతర భారీ వాహనాలకి పార్కింగ్ సౌకర్యం లేదు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 11:30
మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 08:00
#Sri Lakshmi Ganapathi Temple #Ameerpet #Hyderabad #Hindu Temples Guide

Comments
Post a Comment