Sankat Mochan Hanuman Temple | Kavadiguda | Hyderabad | Telangana

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం చాలా విశేషాలతో కూడుకొని ఉన్నది. ఈ దేవాలయం హైదరాబాద్ లోని కవాడిగూడ వద్ద కలదు. ఈ ఆలయానికి సరియైన ద్వి , త్రీయ వాహనాల పార్కింగ్ సౌకర్యం కూడా లేదు. దానికి గల కారణం ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉంటుంది. 

ఈ ఆలయం లో ఎక్కడ లేని విధంగా శ్రీ ఆంజనేయ స్వామి మరియు శ్రీ గణపతి స్వామి దర్శనం ఇస్తారు. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభూ. ఎవ్వరూ ఈ స్వామి ఇక్కడ ప్రతిష్ట చేయలేదు. ఈ ఆలయంలో స్వామి ఒక చెట్టు రూపంలో దర్శనం ఇస్తారు. మొదట ఈ ఆలయం చాలా చిన్నగా ఉంటుంది. స్వామిని దర్శించే భక్తులు దిన దిననాభివృద్ది చెందడం వల్ల ఇప్పుడు ఆలయం కొంచం పెద్దగా నిర్మించడం జరిగినది. 

ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి తో పాటుగా  శ్రీ గణపతి స్వామి , శివలింగం , చెట్టు కింద హనుమాన్ ఆలయం కూడా ఉన్నది. ఆలయం చిన్నగా ఉన్న కూడా శక్తి మాత్రం చాల ఎక్కువ. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00 

శ్రీ రామ నవమి , గణపతి నవరాత్రులు , మహా శివరాత్రి రోజులలో రద్దీ చాలా అధికంగా ఉంటుంది. 


#Sankat Mochan Hanuman Temple  #Kavadiguda  #Hyderabad #Telangana 

Comments