Sri Parwathi Sametha Ramalingeshwara Swamy | Kandur | Mahabubnagar | Telangana
ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించడం ఒక అదృష్టంగా భావిస్తారు. అందుకు గల కారణం ఏ శివాలయం దర్శనం ఎన్నో జన్మల అదృష్టం ఉంటే గాని ఈ ఆలయాన్ని దర్శించ లేరు. ఈ ఆలయం తెలంగాణా లోని మహబూబ్ నగర్ జిల్లా కందూర్ అనే గ్రామంలో ఉన్నది. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి కేవలం 75కి.మీ దూరంలోను మరియు కందూర్ ప్రధాన రహదారి నేషనల్ హైవే కి కేవలం 07 కి.మీ దూరంలోనే ఈ ఆలయం ఉన్నది.
అలంపూర్ శ్రీ జోగుళాంబ అమ్మవారు(అష్టదశ శక్తిపీఠలలో 5వ శక్తి పీఠం). కూడా దగ్గరలోనే ఉన్నది. ఈ ఆలయం ఒక కొండ కి అనుకోని పక్కెనే ఒక కోనేరు మరియు కల్ప వృక్షాలుతో ప్రకృతి కి చాలా దగ్గరగా మరియు ప్రశాంతమైన వాతావరణంలో మనస్సుకి ఎంతో హాయిని కలిగిస్తుంది ఈ ఆలయం దర్శనం. ప్రతి సం || స్వామి అమ్మవార్లకి వారికి కళ్యాణం కూడా నిర్వహిస్తారు. ద్వి ,త్రీ , భారీ వాహనాలు కూడా పార్కింగ్ సౌకర్యం కలదు. శివరాత్రికి మరియు దేవి నవరాత్రి కి ఉత్సవాలు నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్
సాయంత్రం : 04:00 నుంచి 07:30
#Sri Parwathi Sametha Ramalingeshwara Swamy #Kandur #Mahabubnagar #Telangana

Comments
Post a Comment