Maddimadugu Hanuman Temple | Telangana | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం తెలంగాణా చివరి గ్రామంలో నల్లమల లో ఉన్నది. సరిగ్గా మద్ది మడుగు అనే గ్రామంలో ఉన్నది. ఈ ఆలయం పూర్తి పేరు మద్ది మడుగు పబ్బతి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం అని  అంటారు. పబ్బతి అంటే ప్రసన్న, శాంతమూర్తి అని అర్ధం.  

అమ్రాబాద్ నుంచి 45 కి మీ దూరంలో మరియు ఇప్పలపల్లి నుంచి కేవలం  10 కి. మీ దూరంలో నల్లమల  లోతట్టు, అటవీ ప్రాంతంలో స్వామివారు స్వయంగా వెలిశారు. చైత్ర శుద్ధ పౌర్ణమి, కార్తీక మాసాలలో మరియు శ్రీ హనుమాన్ జయంతి శ్రీ రామనవమి ప్రత్యేక పండుగల సమయంలో  ఇక్కడ స్వామి వారికి  ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.ఇక్కడ స్వామి వారికి బెల్లం , గోధుమ రొట్టెలతో చేసిన ప్రత్యేక ప్రసాదాన్ని నివేదన చేస్తారు. వడ మాల ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ స్వామి వారికి మంగళవారం , శనివరం ప్రత్యేకంగా తమలపాకులతో అర్చన చేస్తారు. ఈ ప్రాంతం హైదరాబాదుకు 185 కి.మీ, మహబూబ్‌నగర్‌కు 145 కి.మీ  అచ్చంపేటకు 70కి.మీ దూరంలో ఉన్నది. ఈ ఆలయం నుంచి శ్రీశైలం కి కేవలం 130 కి. మీ దూరంలోనే ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 01:00 

మధ్యాన్నం : 01:00 నుంచి 03:30 బ్రేక్ 

సాయంత్రం : 03:30 నుంచి 07:45 వరకు 

ఈ ఆలయంకి వెళ్ళే ముందే బండి లో పెట్రోల్ బండి లో ఎక్సట్రా స్టెఫీని ఉంచుకోవడం చాలా ఉత్తమం. ఎందుకు అంటే ఇక్కడ అంత నల్లమల అటవీ ప్రాంతం కావడం వల్ల ఎటువంటి పెట్రోల్ బంక్ లు ఎక్కువగ ఉండవు. కేవలం 2 మాత్రమే ఉన్నాయి. అవి కూడా కేవలం బిజినెస్ అవర్స్ లో మాత్రమే పని చేస్తాయి. అక్కడ ఫోన్ లో కూడా సిగ్నల్ లు ఉండవు. రూమ్ లు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. ప్రకృతి ని ఆస్వాదిస్తూ ప్రశాంతతకి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాంతం. 


#Maddimadugu Hanuman Temple  #Telangana  #Hindu Temples Guide 


Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana