Sri Sri Sri Laxmi Narasimha Swamy Temple | Narsing Mandir Road | Shamshabad | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం ఇక్కడ ఉన్నది అని చాలా మందికి తెలియదు. డానికి గల కారణం ఈ ఆలయానికి సరియైన ప్రవేశ ద్వారం మరియు ఇండ్ల మధ్య లో ఉండడం వల్ల సరిగ్గా గమనించకుండానే వెళ్ళిపోవడం వల్ల సరియైన గుర్తింపు లభించలేదు.
ఈ ఆలయం లోని ప్రధాన దేవత మూర్తి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి. ఇక్కడ స్వామి ప్రత్యేకంగా ఉత్సవ మూర్తిని ఉయ్యాల లో ఉంచి పూజ చేసే విధానం ఇక్కడ ఉన్నది. ఈ ఆలయం లోకి ప్రవవేశించగానే మన పూర్వీకుల ఆలయ సంపదకి మనం వారసులం అని తెలుస్తుంది. దానికి గల కారణం ఇక్కడ రాతితో నిర్మించిన శిలాల సౌందర్యం. ఈ ఆలయం నిర్మించి ఇప్పటికి సుమారు 500 సం || కంటే పూర్వం నుంచే ఉన్నది. ఇంతటి శిల్ప కాలతో ఉన్న ఆలయాన్ని రక్షించుకోవడం మన అందరి భాద్యత.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 11:30
మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 07:30
#Sri Sri Sri Laxmi Narasimha Swamy Temple #Narsing Mandir Road #Shamshabad #Hyderabad

Comments
Post a Comment