Sri Mavurala Renuka Yellamma Temple | Padmarao Nagar | Secunderabad | Telangnana
తెలంగాణాలో ఈ అమ్మవారిని అధికంగా కొలిచే వారు ఉన్నారు. కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారం ఈ అమ్మవారు. ఇక్కడి భక్తులు ఈ అమ్మవారిని వల్ల కూతురుగా కూడా భావిస్తారు. ఈ అమ్మవారు పేరు శ్రీ మవురాళ్ళ రేణుక ఎల్లమ్మ తల్లి.
ఈ అమ్మవారి పేరు మీద తెలంగాణా లో చాలా ఆలయాలు ప్రధానంగా హైదరాబాద్ లో అమీర్ పేట వద్ద గల ఎల్లమ్మ తల్లి అమ్మవారు మరియు భువనగిరి వద్ద గల రేణుక ఎల్లమ్మ అమ్మవారు మరియు సికింద్రాబాద్ లో పద్మారావు నగర్ వద్ద ఉన్న శ్రీ మవురాల రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం. ఈ ఆలయం చాలా చిన్నగా ఉంటుంది. ఎటువంటి ద్వి , త్రీ , భారీ వాహనాలు కూడా నిలుపలేరు. ఏవిధమైన పార్కింగ్ సౌకర్యం లేదు. దానికి ప్రధాన కారణం ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం :04:30 నుంచి 07:45
పద్మారావు నగర్ లో ఈ అమ్మవారి పేరు మీద రెండు ఆలయాలు ఉన్నాయి. ఒకటి ప్రారంభంలో ఉంటే రెండు స్కందగిరి ఆలయానికి ప్రారంభంలో ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ కి పక్కనే. ఈ ఆలయానికి కూడా పార్కింగ్ సౌకర్యం లేదు. భక్తులు మాత్రం చాలా మంది వస్తారు.

Comments
Post a Comment