Sri Jain Temple | Medchal | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం పురాతన ఆలయం. హైదరాబాద్ లో చూడవలసినా ఆలయలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం పూర్తిగా తెల్ల రాతితో నిర్మించారు. ఈ ఆలయం సికింద్రాబాద్ నుంచి 25 కి.మీ దూరంలోను మరియు నాంపల్లి నుంచి 35కి. మీ దూరంలో ఉన్నది. ఈ ఆలయం మేడ్చల్ రైల్వే స్టేషన్ కి చాలా దగ్గరగా ఉన్నది.
ఈ ఆలయం లో సత్రాలు కూడా ఉన్నాయి. ఏసి రూమ్ కొరకు 700/- మరియు నాన్ ఏసి రూమ్ 500/- 24 గంటలు మాత్రమే. అవి కూడా కేవలం జైన మతస్థులకి మాత్రమే ఇవ్వబడును. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం లేదు. కేవలం అక్కడికి వెళ్ళి రూమ్ ఉంటే మాత్రమే ఇస్తారు. ఈ ఆలయం మొత్తం తెల్ల రాతి తో నిర్మించడం వల్ల చూడగానే మనస్సుకి ఇట్టే ఆకరసిస్తుంది. ఈ ఆలయం లో 4 ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రధాన దేవత మూర్తి శ్రీ జైన ఆలయం. పిల్లల కొరకు పెద్ద గ్రౌండ్ కలదు. చాలా పెద్ద ప్రాంతం లో ఈ ఆలయం నిర్మించారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 01:30
మధ్యాన్నం : 01:30 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 08:00
కేవలం సంప్రదాయ దుస్తులలో వస్తే మాత్రమే గుడిలోకి అనుమతి ఇవ్వబడును. శనివారం , ఆదివారం , మరియు ఇతర పండుగల సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది.
#Sri Jain Temple #Medchal #Hyderabad #Hindu Temples Guide

Comments
Post a Comment