Sri Sai Mukhtidhamam | Shyam Nagar | Shameerpet | Medchal | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం పూర్తి పేరు శ్రీ సాయి ముక్తిధామం. ఈ ఆలయం మొత్తం రెండు అంతస్థులలో ఉంటుంది. ఈ దేవాలయం తెలంగాణా లోని హైదరాబాద్ వద్ద గల శామీర్ పేట మేడ్చల్ కి మధ్యలో శ్యామ్ నగర్ వద్ద ఉంటుంది. 

ఈ ఆలయంలో మొదట శ్రీ గణపతి , శ్రీ ఆంజనేయ స్వామి , శ్రీ కనకదుర్గా దేవి అమ్మవారు , శ్రీ దత్తాత్రేయ స్వామి తరువాత ప్రధాన దేవత మూర్తి దగ్గరకి వెలుతాము. ప్రతి సం || గురు పూర్ణిమ రోజున విశేష పూజలు నిర్వహిస్తారు. ప్రతి గురువారం రోజున రద్దీ కొంచం అధికంగా ఉంటుంది. ప్రతి రోజు ఉదయం కాకడ హారతి మధ్యాన్నం మధ్యాన్న హారతి సాయంత్రం సెజ్ హారతి ఇస్తారు.   ఆలయం కూడా కొంచం చిన్నగానే ఉంటుంది. గురు పౌర్ణమి రోజున అన్నదాన ప్రసాద వితరణ చేస్తారు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 01:30 

మధ్యాన్నం : 01:30 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 08:00 వరకు 

కేవలం సంప్రదాయం దుస్తులలో వచ్చిన వారికి మాత్రమే దర్శనం కి అనుమతి ఇవ్వబడును. ప్రత్యేక పండుగల సమయంలో ఆలయ రద్దీ ని దృష్టిలో ఉంచుకొని దర్శన సమయంలో ఆ రోజులలో మార్పులు ఉంటాయి. భక్తులు సహకరించగలరు. ద్వి చక్ర వాహనాల పార్కింగ్ సౌకర్యం ఉన్నది. 


#Sri Sai Mukhtidhamam  #Shyam Nagar  #Shameerpet  #Medchal  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana