Sri Ram ghat Hanuman Temple | Gowliguda | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం నిర్మించిన వారు కేవలం ఒకే ఒక వ్యక్తి అంటే నమ్ముతారా? అవును ఈ ఆలయాన్ని నిర్మించినది ఒకే వ్యక్తి.  ఆ రోజు నిర్మించిన ఆలయమే నేడు మీరూ చూస్తున్న ఈ ఆలయం. 

ఈ ఆలయాన్ని మొదట రామయ్య  అనే ఇద్దరు 1956 సం || లో ప్రారంభించారు. ఈ ఆలయం అప్పటి మంచినీటి కాలువా లాగా ప్రవహించే మూసి నది పక్కనే ఉన్నది. కొని సం|| ల తరువాత ఆ ఆలయం పూర్తిగా శిధిలావస్థకి చేరుకున్నది. 2018 వ సం || లో మళ్ళీ ఈ ఆలయాన్ని పునః నిర్మించాలి అని సంకల్పంతో ప్రారంభించారు. ఇప్పుడు ఒక పెద్ద శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు. ఈ ఆలయంలో శివాలయం కూడా ఉన్నది. హనుమాన్ జయంతి రోజున మరియు శ్రీ రామనవమి రోజున రద్దీ చాలా అధికంగా ఉంటుంది. హనుమాన్ శోభయాత్ర కూడా ఇక్కడ చాలా బాగా నిర్వహిస్తారు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 07:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 08:00 

ఈ ఆలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. కేవలం ద్వి చక్ర వాహన పార్కింగ్ మాత్రమే ఉన్నది. దానికి కారణం ఈ ఆలయం ప్రధాన రహదారి మీద ఉండడమే. కేవలం సంప్రదాయ దుస్తులలో మాత్రమే అనుమతి ఇవ్వబడును. హనుమాన్ శోభయత్ర సమయంలో ఆలయం రాత్రి అంత తెరిచి ఉండును. 


#Sri Ram ghat Hanuman Temple  #Gowliguda  #Hyderabad  #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana