Sri Ganapati Karyasiddi Hanuman Temple | RBI Colony | VijayNagar Colony | Kothapet | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతనా ఆలయం. ఈ దేవాలాయం చిన్నగా ఉన్న కూడా చాలా శక్తివంతమైన ఆలయం. ఈ దేవాలయం చిన్నగా ఉన్న కూడా ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయం హైదరాబాద్ లోని యల్.బి. నగర్ కి కొద్ది దూరంలో గల కొత్తపేట్ విజయ్ నగర్ కాలనీ కి మరియు ఆర్.బి.ఐ కాలనీ కి మధ్యలో ఈ దేవాలయం ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మి గణపతి స్వామి తో పాటుగా కార్యసిద్ది హనుమాన్ ఆలయం కూడా ఉన్నది. ఇలాంటి కార్యసిద్ది హనుమాన్ పేరు తో గల ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. వాటిని తప్పకుండ దర్శించుకోవాలి. ఈ దేవాలయంలో మరియొక్క ప్రత్యేకత ఏమిటి అనగా శివలింగం వెనుకనే అమ్మవారి విగ్రహం ఉండడం విశేషం. మరియు ఆ శివలింగం శుద్ద స్పటిక కాశీవిశ్వేశ్వర స్వామి లింగం. ఈ శివలింగాన్నికి పాలతో అభిషేకం చేస్తే మరింత తెల్లగా పసుపు నీటితో అభిషేకం చేస్తే పసుపురంగు గాను, కుంకుమ నీటితో అభిషేకం చేస్తే కుంకుమ రంగు శివలింగంగా కనిపిస్తుంది. ప్రతి మాస శివరాత్రి , సోమవారం , మహా శివరాత్రి , దేవి నవరాత్రి , గణపతి నవరాత్రి , హనుమాన్ జయంతి ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు. ప్రత్యేక రోజులలో ఉచిత సామూహిక అన్నదాన ప్రసాద వితరణ కూడా...