Kishanbagh Shiva Sri Jaganath Swamy Temple | Kishan Bagh | Attapur | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం 300 సం || కంటే ముందు నుంచే ఇక్కడ ఉన్నది. ఈ ఆలయం కొంచం శిధిలావస్థకి చేరుకున్నది. ఈ దేవాలయం అంతా రాతి తో నిర్మించారు. అన్నీ సం || కావడం వల్ల ఇప్పుడు ఈ ఆలయం కొంచం దెబ్బ తిన్నది. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ కి కేవలం 05 కి.మీ దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. ఈ దేవాలయం సరిగ్గా కిషన్ బాఘ్ x రోడ్ మీదనే ఉంటుంది. ఈ ఆలయనికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. అందుకు గల ప్రధాన కారణం ఈ దేవాలయం ప్రధాన రహదారి మీద ఉండడం ఐతే మరియొక్క కారణం ఈ ఆలయం ఇతర మతస్థుల ప్రాంతం లో ఉండడం.  

ఈ దేవాలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ జగనాథ్ స్వామి. ఈ దేవాలయంలో శ్రీ జగనాథ్ స్వామి తో పాటు ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ సీతా రామ ఆలయం, శివాలయం కూడా ఉన్నాయి.

ఈ ఆలయంలో ప్రతి సం | | ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ జయంతి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీ రామ నవమి రోజున మరియు మరియు శ్రీ సీతా రాముల కళ్యాణం రోజున ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. మరియు శ్రీ జగనాథ్ స్వామి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 11:00

మధ్యాన్నం : 11:00 నుంచి 04:30

సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు 

 

#Kishanbagh Shiva  #Sri Jaganath Swamy Temple #Kishan Bagh  #Attapur  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana