Sri Venkateshwara Swamy Temple | NMDC Rd | Masab Tank | Hyderabad
ఈ దేవాలయం హైదరాబాద్ లోని మెహింది పట్నం కి కేవలం 03 కి.మీ దూరంలోనే మరియు ప్రధాన రహదారి మీద ఉన్న NMDC అనే ప్రభుత్వ కార్యలయం వెనుకనే ఈ దేవాలయం ఉంటుంది. ఇంతటి పురాతన ఆలయం తప్పకుండ దర్శించుకోవాలి.
ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ వేంకటేశ్వర స్వామి. ఇక్కడ స్వామిని ఎంత సేపు చూసిన ఇంకా చూడాలి అనే అనిపిస్తుంది. అంతా అందంగా ఉంటారు ఈ స్వామి. ఈ ఆలయంలో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ గణపతి స్వామి దేవాలయం , శ్రీ రాజ రాజేశ్వరి దేవి ఆలయం, శివాలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , శ్రీ సీతా రామ లక్ష్మణ స్వామి దేవాలయాలు కూడా ఉన్నాయి.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 11:30
మధ్యాన్నం : 11:30 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు
సాయంత్రం సమయంలో ఈ ఆలయం నుంచి సిటి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. దానికి గల కారణం ఈ ఆలయం ఒక కొండ మీద ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారిని చాలా బాగా అలంకరణ చేస్తారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు, దేవి నవరాత్రి ఉత్సవాలు, శివరాత్రి ఉత్సవాలు, శ్రీ వేంకటేశ్వర స్వామి కి కళ్యాణం కూడా నిర్వహిస్తారు. స్వామి వారికి కళ్యాణం నిర్వహించే అప్పుడు ఈ చుట్టూ పక్కల నుంచే మాత్రమే కాకుండా రాష్ట్ర నలువైపుల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు.
#Sri Venkateshwara Swamy Temple #NMDC Rd #Masab Tank #Hyderabad

Comments
Post a Comment