Sri Dattatreya Swamy Temple | Dattatreya Pahad | Sitarambadh | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం సుమారు 500 సం || కంటే ముందు నుంచే ఉన్నది అని ఇక్కడి స్థానికులు చెపుతున్నారు. ఈ ఆలయం చాలా అరుదుగా కనిపిస్థాయి. 

ఈ దేవాలయం హైదరాబాద్ లోని సీతారాంబాఘ్ వద్ద గల దత్తాత్రేయ పహాడ్ అని పిలుస్తారు. ఈ దేవాలయం గుట్ట మీద ఉండడం వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చినది. ఈ ఆలయం లో స్వామి ని దర్శించుకోవడానికి సుమారు 165 మెట్లు వరకు ఎక్కలి. 

ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ దత్తాత్రేయ స్వామి కొలువై ఉన్నారు. ఈ స్వామి తో పాటు శ్రీ శివాలయం , దుర్గా మాతా ఆలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , శ్రీ రామ ఆలయం కూడా ఉన్నది. ప్రతి సం || దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా శ్రీ దత్తాత్రేయ స్వామి నవగ్రహ మండపం కూడా ఉన్నది. 

సాయంత్రం సమయంలో ఈ ఆలయం నుంచి నగర వీక్షణ చాలా బాగా ఉంటుంది. ఈ ఆలయం కొంచం ఇతర మతస్థుల ప్రాంతంలో ఉండడం వల్ల సరియైన అభివృద్ది జరగడం లేదు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00

మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్ 

సాయంత్రం : 04:00 నుంచి 07:45 వరకు 


#Sri Dattatreya Swamy Temple  #Dattatreya Pahad  #Sitarambadh  #Hyderabad

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana