Sri Lakshmi Ganapathi Devalayam | Castle Hills | APHB Colony | Vijaynagar Colony | Mehindipatnam | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతనా ఆలయం. ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఆలయం కొంచం పెద్దగానే ఉంటుంది. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిందీపట్నం వద్ద గల ఎన్‌ఎం‌డి‌సి(NMDC) వెనుక గల విజయ్ నగర్ కాలనీ వద్ద ఉంటుంది. ఈ ఆలయం ప్రధాన రహదారి మీద ఉండడం వల్ల సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. 

ఈ ఆలయంలో ప్రధాన దేవతా మూర్తి శ్రీ లక్ష్మి గణపతి స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో చాలా ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ ఆది శంకరాచార్య స్వామి ఆలయం , శివాలయం , గణపతి నవరాత్రి ఉత్సవ విగ్రహాల మండపం కూడా ఉన్నాయి. 

ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ గణపతి స్వామి యొక్క నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. 10 రోజుల పాటు చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించి భజనలు చేస్తారు. ఈ ప్రత్యేక రోజులలో స్వామి వారికి మొదట సుప్రభాత సేవ , అభిషేకం , అర్చనా , గరిక పూజా , హోమలు , భజనలు కూడా నిర్వహించి ఉచిత సామూహిక అన్నదాన ప్రసాద వితరణ కూడా నిర్వహించి ఉత్సవ విగ్రహాన్ని నిమార్జనము కూడా చేస్తారు. 

ఈ ఆలయంలో కేవలం గణపతి నవరాత్రి ఉత్సవాలు మాత్రమే కాకుండా దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. మహా శివరాత్రి రోజున స్వామి వారికి విశేష పూజలు జరిపి రాత్రి సమయంలో అభిషేకం నిర్వహించి , హోమం కళ్యాణం కూడా చేస్తారు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 11:30 

మధ్యాన్నం : 11:30 నుంచి 04:45 బ్రేక్ 

సాయంత్రం : 04:45 నుంచి 08:00 వరకు 


#Sri Lakshmi Ganapathi Devalayam  #Vijaynagar Colony  #Castle Hills #APHB Colony #Mehindipatnam #Hyderabad 


Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana