Sri Nalla pochamma Sri Mutyalamma Temple | Indira Nagar colony | Jiyaguda | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి చాలా మంది కమిటీ సభ్యులు కలరు. ఈ దేవాలయం అత్యంత పురాతన ఆలయం కావడం వల్ల చాలా ప్రసిద్ది చెందినది. ఈ ఆలయాన్ని ఇక్కడి భక్తులు శ్రీ నల్ల పోచమ్మ మరియు శ్రీ ముత్యాలమ్మ అని పిలుస్తారు.
ఈ దేవాలయం హైదరాబాద్ లోని ఇందిరా నగర్ కాలనీ, జియా గూడ వద్ద ఉన్నది, ఈ ఆలయం కొంచం చిన్నగా ఉన్న కూడా చాలా మంది భక్తులు వస్తు ఉంటారు.
ఈ దేవాలయంలో ప్రతి సం || ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి మంగళ వారం , శుక్రవారం , ఆదివారం రద్దీ కొంచం ఎక్కువగా ఉంటుంది. మంగళ మరియు శుక్ర వారాలలో అమ్మవారికి విశేష పూజలు , కుంకుమార్చనలు , హోమలు , శ్రీ లలిత సహస్ర పరాయణాలు జరుగుతాయి.
ప్రతి సం || ఆశ్వయుజ మాసం లో అమ్మవారికి దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజులలో అమ్మవారికి విశేష అలంకరణలు జరుగుతాయి. లలిత హోమం , చండీ హోమలు కూడా నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00
#Sri Nalla pochamma Sri Mutyalamma Temple #Indira Nagar colony #Jiyaguda #Hyderabad

Comments
Post a Comment