Sri Anjaneya Swamy Temple | Tallagadda | Gudimalkapur | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం పూర్తిగా రాతితో నిర్మించారు. ఈ ఆలయం లోని హనుమాన్ ఆలయం ఎంతో ప్రసిద్ది చెందిన ఆలయం. చిన్న ఆలయమే ఐన కూడా చాలా ప్రసిద్ది చెందిన ఆలయం.
ఈ దేవాలయం హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ వద్ద గల మార్కండేయ నగర్ కి కొద్ది దూరంలో గల తాళ్ళగడ్డ వద్ద ఈ దేవాలయం ఉన్నది. ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉంటుంది. ఈ ఆలయానికి మరియొక్క దారి కూడా ఉన్నది. హైదరాబాద్ లోని కార్వాన్ నుంచి కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ ఆంజనేయ స్వామి. ప్రతి సం || శ్రీ ఆంజనేయ స్వామి జయంతి శ్రీ రామ నవమి శ్రీ సీతా రాముల కళ్యాణం కూడా చాలా పెద్ద ఎత్తున్న జరుగుతుంది.
ఈ ఆలయంలో ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ గణపతి స్వామి ఆలయం , శ్రీ రాధాకృష్ణా స్వామి ఆలయం, శివాలయం కూడా ఉన్నాయి.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00
#Sri Anjaneya Swamy Temple #Tallagadda #Gudimalkapur #Hyderabad

Comments
Post a Comment