Sri Rama Sahitha Sri Satyanarayana Swamy Temple | Puppalguda | Hyderabad
ఈ ఆలయం పురాతన ఆలయం. ఈ ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయంలో శ్రీ గురుకృప వేద పాఠశాల కూడా ఉన్నది. ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉండడం వల్ల చాలా తొందరనే ఈ ఆలయం కనపడుతుంది. ఈ ఆలయం వెనుకనే శ్రీ గురుకృప వేద పాఠశాల కూడా ఉన్నది.
ఈ ఆలయం హైదరాబాద్ లోని శ్రీ రామ్ నగర్ కాలనీ , పుప్పలగుడ వద్ద ఉన్నది. ఈ ఆలయం మెహిందీపట్నం కి కొంచం దూరంలోనే ఉంటుంది. ఈ ఆలయానికి ద్వి చక్ర వాహన పార్కింగ్ సౌకర్యం మాత్రమే ఉన్నది. ప్రధాన రహదారి మీద ఉండడం వల్ల పార్కింగ్ సౌకర్యం కొంచం ఇబ్బంది అవుతుంది.
ఈ ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయంలో గణపతి ఆలయం , శివాలయం , శ్రీ దుర్గా దేవి ఆలయం , శ్రీ రామ ఆలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ రామాసమేత శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం కూడా ఉన్నది. ప్రతి సం || స్వామి వారికి వార్షిక ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. శ్రీ రామ నవమి రోజున స్వామి వారికి కళ్యాణం నిర్వహిస్తారు. ఆ రోజున అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు
#Sri Rama Sahitha Sri Satyanarayana Swamy Temple #Puppalguda #Hyderabad

Comments
Post a Comment