Sri Abhayanjaneya Swamy Temple | Happy Homes Heights Colony | Janachaithanya Colony | Dairyfarm | Hyderabad
ఈ ఆలయం చాలా చిన్న ఆలయం మరియు నూతనంగా నిర్మించిన ఆలయం. ఈ ఆలయం మూసి నది కి కొంచం దూరంలోనే ఉంటుంది.
ఈ ఆలయం హైదరాబాద్ లోని రాజేంధ్ర నగర్, డైరీ ఫారం వద్ద గల హిప్పీ హోం హెయిఘ్త్స్ కాలనీ జనచైతన్య కాలనీ కి మధ్యలో ఈ ఆలయం ఉంటుంది, ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉంటుంది. పార్కింగ్ సౌకర్యం కలదు. ఆలయం చిన్నగా ఉన్న పార్కింగ్ సౌకర్యం మాత్రం పెద్దగానే ఉంటుంది.
ఈ ఆలయం లో ప్రధాన దేవత మూర్తి శ్రీ అభయంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయం ప్రారంభంలోనే పూర్తి రాతి చేసిన ధ్వజ స్తంభం కనిపిస్తుంది. పైన ఫోటో లో మనం గమనించవచ్చు. ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి తో పాటు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి.
శ్రీ సీతా రామ లక్ష్మణ స్వామి ఆలయం , శివాలయం కూడా ఉన్నది. ప్రతి సం || శ్రీ ఆంజనేయ స్వామి జయంతి మరియు శ్రీ సీతా రామ కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ ఆలయం ఇతర మతస్థుల కాలనీ లో ఉండడం వల్ల సరియైన అభివృద్ది జరగడం లేదు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 08:00
#Sri Abhayanjaneya Swamy Temple #Happy Homes Heights Colony #Janachaithanya Colony #Dairyfarm #Upperpally #Rajendhranagar #Hyderabad

Comments
Post a Comment