Sri Hanuman Mandir | Near Niloufer cafe | Redhills | Lakidikapool | Hyderabad


 ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం సుమారు 100 సం || పైనే ఈ ఆలయ చరిత్ర. ఈ ఆలయం పూర్వం అంతా రాతితో నిర్మించి ఉండేది. కానీ కాల క్రమేణా మార్పుల వల్ల ఇప్పుడు ఈ ఆలయం కొంచం పునః నిర్మాణం చేశారు. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని లక్కిడికపూల్ వద్ద గల రెడ్ హీల్స్ వద్ద కలదు. మీకు ఇంత సరిగ్గా చేరుకోవాలి అంటే లక్కిడికపూల్ వద్ద గల నీలోఫర్ కేఫ్ కి ఏదురుగానే ఈ దేవాలయం ఉంటుంది. 

ఈ ఆలయంలో ప్రతి మంగళవారం మరియు శనివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆ రోజున స్వామి వారికి ప్రత్యేకంగా తమలకులతో అర్చనా చేసి స్వామి వారిని అలంకరణ చేస్తారు. 

ఈ ఆలయం బయటి నుంచి చూస్తే చూడడానికి చిన్నగా కనిపించిన లోపల మాత్రం పెద్దగానే ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి తో పాటు శ్రీ సీతా రామ లక్ష్మణ స్వామి ఆలయాలు కలవు. ఈ దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి జయంతి మరియు శ్రీ సీతా రాముల కళ్యాణం చాలా బాగా జరుగుతాయి. ఆ రోజున అన్నదాన ప్రసాద వితరణ జరుగుతుంది. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 08:30 వరకు 


#Sri Hanuman Mandir  #Near Niloufer cafe  #Redhills  #Lakidikapool  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana