Sree Pochamma Sahitha Sri Vijaya Durga Devi Temple | Humayun Nagar | Mehindipatnam | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం కొంచం చిన్నగా ఉంటుంది. కానీ చాలా శక్తివంతమైన ఆలయం. ఇక్కడి ప్రజలు ఈ అమ్మవారిని శ్రీ పోచమ్మ సహితా శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారి ఆలయంగా పిలుస్తారు.
ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిందీపట్నం కి అతి సమీపంలో గల హుమాయూన్ నగర్ వద్దగల EX-service men కాలనీ కి మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. కేవలం ద్విచక్ర వాహన పార్కింగ్ సౌకర్యం మాత్రమే ఉన్నది. త్రీ చక్ర , కార్ , మినీ బస్ పార్కింగ్ సౌకర్యం లేదు. అందుకు ప్రధాన కారణం ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఈ ఆలయం ఉంటుంది.
ఈ ఆలయంలో ఇద్దరు అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఒకటి శ్రీ పోచమ్మ అమ్మవారి ఆలయాలు, రెండవది శ్రీ విజయదుర్గా దేవి అమ్మవారి ఆలయం. ఆషాఢ మాసంలో శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి 10 రోజుల పాటు దసరా ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. అప్పుడు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అమ్మవారికి పది రోజుల పాటు విశేష అలంకరణలు , కుంకుమార్చనలు, హోమలు నిర్వహించి సాయంత్రం లలిత స్తోత్ర పరాయణాలు నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు
#Sree Pochamma Sahitha Sri Vijaya Durga Devi Temple #Humayun Nagar #Mehindipatnam #Hyderabad

Comments
Post a Comment