Sri Sankata Vimochana Hanuman Temple | Gudi Malkapur | Mehindipatnam | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం లో ప్రధాన దేవత మూర్తి శ్రీ ఆంజనేయ స్వామి. ఈ స్వామి ఈ ప్రదేశంలో శ్రీ సంకట విమోచన హనుమాన్ గా వెలిశారు. మనకి ఉండే మానసిక సమస్యలకి పరిష్కారమే ఈ ఆలయంలోని స్వామి ని దర్శించడం అని పెద్దలు చెపుతారు. 

ఈ దేవాలయం హైదరాబాద్ లోని మెహిందీపట్నం వద్ద గల గుడి మల్కాపూర్ అనే గ్రామంలో కలదు. ఈ దేవాలయం సరిగ్గా గుడిమల్కాపూర్ అనే ప్రాంతంలో గుడిమల్కాపూర్ రైతు బజార్(రైతు మార్కెట్) కి కేవలం 250 మీటర్ల దూరంలోనే ఈ దేవాలయం ఉన్నది. 

ఈ దేవాలయం చూడడానికి చిన్నగా ఉన్న కూడా చాలా శక్తివంతమైన దేవాలయం. ఈ ఆలయంలో ప్రతి సం || స్వామి వారికి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ప్రతి సం|| శ్రీ ఆంజనేయ జయంతి రోజున భారీ ఎత్తున పూజలు నిర్వహించి అందరికీ ఉచిత సామూహిక అన్నదాన ప్రసాద వితరణ కూడా చేస్తారు. ఈ ఆలయానికి కేవలం ద్వి చక్ర వాహన పార్కింగ్ మాత్రమే ఉన్నది. అందుకు ప్రధాన కారణం ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం  :

ఉదయం : 06:00 నుంచి 12:00 
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 
సాయంత్రం : 05:00 నుంచి 08:00 

#Sri Sankata Vimochana Hanuman Temple  #Gudi Malkapur  #Mehindipatnam  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana