Sri Brahmaraamba Mallikarjuna Swamy Goshala | Raghavendra Colony | Ramachandrapuram | BiramgudaGutta | Hyderabad
ఈ గోశాల చాలా పెద్ద గోశాల. ఈ గోశాల లో చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడి భక్తులు ఈ గోశాల ని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి గోశాల అని పిలుస్తారు. గోశాల అంటే ఏదో కొని ఆవులు మాత్రమే ఉంటాయి అని అనుకుంటున్నారు ఏమో. ఇక్కడ అలా ఉండధు. ఈ గోశాల మొత్తం 10 ఎకరాల కంటే పెద్దగానే ఉంటుంది. ఈ గోశాల బీరంగుడ గుట్ట శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం నుంచి కేవలం 01కి.మీ దూరంలో గుట్ట కింద ఎడమవైపున ఉంటుంది. నూతనంగా నిర్మించిన govt క్వాటర్స్ వెనుకనే ఈ గోశాల ఉంటుంది.
ఈ గోశాల లో చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ కృష్ణా ఆలయం , శ్రీ సీతారామ లక్ష్మణ సమెత ఆంజనేయ స్వామి ఆలయం, నాగదేవత ఆలయం , ధ్యాన మందిరం , చిన్నగా ఉన్న బ్రహ్మసూత్ర శివలింగం , పక్కనే గణపతి , సుబ్రమణ్య స్వామి 10 గోశాల నివాస షేడ్డు లు ఉన్నాయి.
ఈ ఆలయంలో ప్రతి సోమవారం శివాలయంలో , గురువారం శ్రీ కృష్ణా స్వామి ఆలయంలో , శనివారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. శివాలయంలో స్వయంగా మన చేతులతో మనమే స్వామి కి అభిషేకం చేసుకోవచ్చు.
ఈ ఆలయంలో సుమారు 1000కి పైగా గోవూలు ఉన్నాయి. ఈ నెల 23/11/2025 న మహాస్వామి సేవ సమితి వారి ఆద్వర్యంలో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహా స్వామి వారి పాదుకా పూజ జరిగినది.
ఈ గోశాల లో చిన్న పిల్లల కోసం ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉన్నది. ఇక్కడ చాలా పెద్ద పార్కింగ్ సౌకర్యం కలదు. ఇక్కడ నాగదేవత , శివాలయం , శ్రీ కృష్ణ స్వామి ఆలయం , చాలా బాగా ఉంటాయి.
గోశాల దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 07:30 వరకు
#Sri Brahmaraamba Mallikarjuna Swamy Goshala #Raghavendra Colony #Ramachandrapuram #BiramgudaGutta #Hyderabad

Comments
Post a Comment