Suvarchala Sahitha Anjaneya swamy Temple | T V Colony | Vanasthalipuram | Hyderabad

 


ఎలాంటి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. హైదరాబాద్ లో తప్పకుండ దర్శించవలసిన ఆలయాలలో ఈ దేవాలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో మనకి హనుమ తన ధర్మపత్ని తో సహ కలిసి దర్శనం ఇస్తారు. ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం కొంచం చిన్నగానే ఉంటుంది. మరియు ఈ దేవాలయం ప్రధాన రహదారి మీదనే ఉంటుంది.  

ఈ ఆలయం హైదరాబాద్ లోని ఎల్.బి. నగర్ కి కొంచం దూరంలో గల వనస్థలిపురం వద్ద టి.వి.కాలనీ ఫేస్-4 వద్ద ఉంటుంది. ఈ ఆలయం ఎల్.బి. నగర్ నుంచి ఈ ఆలయం కేవలం 3.5కి.మీ దూరంలోనే ఉంటుంది. సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. కేవలం ద్వి చక్ర వాహనాల పార్కింగ్ సౌకర్యం మాత్రమే ఉన్నది.

ఈ ఆలయంలో మనకి శ్రీ ఆంజనేయ స్వామి తో పాటు తన ధర్మపత్ని ఐన శ్రీ సువర్చల దేవి కూడా దర్శనం ఇస్తారు. ఈ ఆలయంలో శ్రీ సీతా రామ సమెత లక్ష్మణ స్వామి కూడా దర్శనం ఇస్తారు. ప్రతి సం || శ్రీ ఆంజనేయ జయంతి మరియు అతి అరుదుగా చేసే శ్రీ ఆంజనేయ స్వామి సువర్చల దేవి కళ్యాణం , శ్రీ సీతా రాముల కళ్యాణం కూడా చూడవచ్చు. 

ప్రతి మంగళ వారం మరియు శనివారం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శనివారం భక్తులు సాయంత్ర సమయంలలో శ్రీ హనుమాన్ చాలీసా చదువుతూ భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00  నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:30 వరకు 


#Suvarchala Sahitha Anjaneya swamy Temple  #T V Colony  #Vanasthalipuram #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana