Sri Annapurnamma Temple | Karwan Rd | Jaffarguda | Talla Gadda | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయ దర్శనం వల్ల అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం పొందిన వారం అవుతాము. ఈ దేవాలయం పూర్తిగా రాతి తో నిర్మించి ఉంటుంది.
ఈ ఆలయం హైదరాబాద్ లోని కార్వాన్ రోడ్ వద్ద గల జఫ్ఫర్ గూడ తాళ్ల గడ్డ గ్రామానికి మధ్యలో ఉంటుంది. ఈ ఆలయం మెహింది పట్నం కి కేవలం 05 కి.మీ దూరంలోనే ఉంటుంది. మెహింది పట్నం నుంచి కార్వాన్ రోడ్ వరకు బస్ లో వచ్చి అక్కడి నుంచి ఆటొ లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
ఈ ఆలయానికి పెద్ద పార్కింగ్ సౌకర్యం కలదు. ద్వి చక్ర , త్రీ చక్ర , బస్ మరియు మినీ బస్ లాంటి వాహనాల పార్కింగ్ చేసుకోవచ్చు.
ఈ ఆలయంలో ప్రతి సం || అమ్మవారికి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు కూడా సమర్పిస్తారు. ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి దేవి నవరాత్రి పూజలు చాలా ఘనంగా జరుగుతాయి. ప్రతి రోజు అమ్మవారికి కుంకుమార్చన , హోమలు కూడా జరుగుతాయి.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 08:00
#Sri Annapurnamma Temple #Karwan Rd #Jaffarguda #Talla Gadda #Hyderabad

Comments
Post a Comment