Sri Sri Sri Renuka Yellamma Temple | Hyderguda | Attapur | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని సుమారు 25 సం || ముందు నుంచే ఇక్కడ ఉన్నది. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. ఈ అమ్మవారి ఆలయంలో అమ్మ మనకి అమ్మ జ్యోతి రూపంలో కూడా దర్శనం ఇస్తుంది.
ఈ దేవాలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ కి దగ్గర లోగల హైదర్ గూడ పిల్లర్ నెంబర్ 140 కి ఎదురుగానే ఈ అమ్మవారి ఆలయం ఉంటుంది. సరిగ్గా హైదర్ గూడ బంటియా కి ఎదురుగా ఈ అమ్మవారి ఆలయం ఉంటుంది.
ఈ ఆలయం లో అమ్మవారి పేరు శ్రీ శ్రీ శ్రీ రేణుకా యెల్లమ్మ అమ్మవారు. ఈ అమ్మవారు ఇక్కడి గ్రామ దేవత గా కొలుస్తారు. ప్రతి సం || ఆషాఢ మాసంలో ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఈ ఆలయం చిన్న గా ఉన్న కూడా చాలా శక్తివంతమైన ఆలయం. పోతరాజులు కూడా ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శిస్తారు.
పూర్వం ఈ ఆలయం చిన్నగా ఉన్న కూడా ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా అభివృద్ది కి నోచుకుంటుంది. ఈ ఆలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. అందుకు ప్రధాన కారణం ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 03:30 బ్రేక్
సాయంత్రం : 03:30 నుంచి 08:00
#Sri Sri Sri Renuka Yellamma Temple #Hyderguda #Attapur #Hyderabad

Comments
Post a Comment