Sri Putta Yellamma Sri Renuka Devi Alayam | Sathyanarana nagar | Gudimakapur | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం కొంచం చిన్నగా ఉంటుంది. ఇలాంటి ఆలయం హైదరాబాద్ లో చాలా తక్కువగా దర్శనం ఇస్తుంది. ఈ అమ్మవారు ఇక్కడ గ్రామ దేవతగా ఉన్నారు.
ఈ ఆలయం హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ పిల్లర్ నెంబర్ 84 నుంచి సత్యానారాయణ నగర్ లో ఉంటుంది. ఈ ఆలయానికి కేవలం ద్వి చక్ర వాహన పార్కింగ్ సౌకర్యం కలదు. ఈ ఆలయం ఇంటీలలో మధ్యలో ఉంటుంది.
ఈ ఆలయంలో అమ్మవారు శ్రీశ్రీ శ్రీ పుట్ట ఎల్లమ్మ రేణుకా దేవి ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయంలో అమ్మవారు ప్రధాన దేవతగా కొలువై ఉన్నారు. ప్రతి సం|| ఆషాఢ మాసంలో ఇక్కడ అమ్మవారికి చాలా మంది భక్తులు బోనాలు సమర్పిస్తారు. ఆశ్వయుజ మాసంలో ఇక్కడ కూడా అమ్మవారికి దసరా ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.
దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించి ప్రతి రోజు కుంకుమార్చన చేసి ప్రత్యేక అలంకరణ చేస్తారు. ఉచిత ఆన్నదాన ప్రసాద వితరణ కూడా చేస్తారు. సాయంత్రం సమయంలో ఈ ఆలాయంలో రద్దీ చాలా తక్కువగా ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 08:00 వరకు
#Sri Putta Yellamma Sri Renuka Devi Alayam #Sathyanarana nagar #Gudimakapur #Hyderabad

Comments
Post a Comment