Sri Prasanna Anjaneya Swamy Temple | Devuni Kunta | Humayun Nagar | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం చిన్నగా ఉన్న కూడా చాలా శక్తివంతమైన ఆలయం. ఈ ఆలయం శ్రీ హనుమాన్ భక్త సమాజం వారి ఆధ్వర్యం లో నడుస్తున్న ఆలయం.
ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిందీపట్నం హుమాయూన్ నగర్ వద్ద గల దేవుని కుంట అనే ప్రాంతంలో ఈ దేవాలయం కలదు. ఈ ఆలయాన్ని ఇక్కడి భక్తులు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంగా పిలుస్తారు.
ఈ ఆలయం కొంచం ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ గణపతి స్వామి ఆలయం, శివాలయం, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి ఆలయం, నవగ్రహ మండపం కూడా ఉన్నది.
ఈ ఆలయంలో ప్రతి సం || శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామికి ఉత్సవాలు జరుగుతాయి. స్వామి కి ప్రతి శనివారం తమలపాకులు తో అలంకరణ , అర్చనా చేస్తారు. అప్పుడు తప్పకుండ స్వామి ని దర్శిస్తే మనస్సు చాలా ప్రశాంతతని పొందుతుంది.
ఈ దేవాలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. అందుకు గల ప్రధాన కారణం ఈ దేవాలయం ప్రధాన రహదారి మీదనే ఉంటుంది. హనుమాన్ జయంతి రోజున ఈ ఆలయంలో ఉచిత సామూహిక అన్నదాన ప్రసాద వితరణ కూడా చేస్తారు. శ్రీ సీతా రాముల కళ్యాణం రోజున కళ్యాణం నిర్వహించి ప్రసాద వితరణ కూడా జరుగుతుంది.
మెహింది పట్నం నుంచి ఈ ఆలయం కేవలం 05 కి.మీ దూరంలోనే ఉండడం విశేషం. ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రసన్నంగా ఉండడం వల్ల ఈ పేరు వచ్చినది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 08:00 వరకు
#Sri Prasanna Anjaneya Swamy Temple #Devuni Kunta #Humayun Nagar #Hyderabad

Comments
Post a Comment