Posts

Showing posts from October, 2024

Sri Chitragupta Temple | Uppuguda | Hindu temples guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. సుమారు 450 సం| పురాతన ఆలయం. ఈ దేవాలయం  కందికల్ గెట్ ఉప్పుగూడ వద్ద గలదు. మన దేశంలో దక్షిణ భారతదేశంలో  ఉన్న ఏకైక చిత్రాగుప్త ఆలయం.  కాయస్థుల వంశస్తులు ఈ ఆలయం నిర్మించారు అని చరిత్ర. వీరు చిత్రాగుప్త కుటుంబ సభ్యులు. చిత్రాగుప్తునికి ఇద్దరు భార్యలు. ఒకరు ఐరావతి, ఒకరు దక్షిణతి. వీరికి మొత్తం 12 సంతానం.  ప్రతి వారం బుధవారం రోజున ప్రత్యేక అభిషేకం జరుపబడుతుంది. చెల్లెలు అన్నచిత్రాగుతునికి మాట కోసం తన కుటుంబ సభ్యులు మరియు సమాజం శ్రేయస్సు బాగా ఉండాలి అని కోరుకుంటుంది. ఈ మాటని చిత్రాగుప్తులు వారు యమధర్మ రాజుకు చెప్పగానే వారు తమ ఆశీర్వాదం అందిస్తారు. ఇక్కడ పూజలు నిర్వహిస్తే గ్రహ దోషాలు, పితృ దోషాలు తొలిగిపోతాయి అని ప్రజల విశ్వాసం.  ఈ ఆలయంలో శివాలయం , దుర్గాదేవి ఆలయం , సుబ్రమణ్య స్వామి ఆలయం , గణపతి ఆలయం , సాయిబాబా ఆలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా కలవు. పండుగ సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఆలయం ప్రాంగణంలో పెద్ద భావి కలదు. అందులో నుంచి వచ్చే నీరుని పూర్వం అభిషేకం కోసం వాడేవారు. శ్రీ రామ నవమి, దసరా , దీపావళి , శివరాత్రి బాగా నిర్వహిస్తారు....

Naraka chaturdasi | Deepavalli | Hindu temples guide

Image
  నరకచతుర్దశి :  నరకచతుర్దశి సూర్యోదయానికి ముందే లేచి తైలాంభ్యంగన స్నానం- తె.4.30 నుంచి ఉ.5.30లోపు చేయాలి.  నరకచతుర్దశినాడు సూర్యోదయానికి ముందే లేచి, నువ్వుల నూనెతో తలంటుకొని, వేడినీళ్ళతో అభ్యంగన స్నాన మాచరిస్తారు. మహారాష్ట్రలో ‘ఉప్తాన్’ అనే శనగపిండితో తలస్నానం చేస్తారు. నూతన వస్త్రాలు ధరిస్తారు.   ఈ రోజు యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయచ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షమాయచ ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమాత్మనే... అని యమనామాలు పఠించి, తర్పణాలు వదిలితే, అకాల మృత్యుదోషాలు తొలుగుతాయి.  పూర్వకాలంలో గోగుకొమ్మ లేక ఆముదపు కొమ్మకు నూనెలో తడిపిన నూలు వస్త్రంలో నల్లనువ్వులు చిన్నమూటగా కట్టి, వెలిగించి, పిల్లలకు దిష్టితీసి, ఉత్తరం నుండి దక్షిణం వైపుగా తిప్పి పడేసేవారు. దీనిని ‘ఉల్కాదానం’ లేదా దివిటీలు వెలిగించడం అంటారు.  ప్రదోష కాలంలో దక్షిణదిశగా నిలపడి ఆకాశంవైపు దీపాన్ని చూపుతారు. ఈ దీపం మన పితృదేవతలకు జ్యోతిరాదిత్య మార్గంలో బ్రహ్మలోకానికి దారి చూపుతుందని, వారికి నరకబాధ ఉండదని, మనం పితరులను మరచి పోలేదనే తృప్తి వారి ఆత్మలకు కలిగి స్తుందని ధర్మశాస్త్రం అంటుంది.  నరక చతుర...

Sri Balkampet Yallamma Temple | Balkampet | Ameerpet | Hindu temples guide

Image
  ఈ ఆలయం హైదరాబాద్ లోని బల్కంపేట అనే ప్రాంతంలో కలదు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఇక్కడ అమ్మవారు ఎల్లమ్మ దేవిగా పూజలు అందుకుంటుంది. ఈ ఆలయానికి చాలా పెద్ద చరిత్ర కలదు. ఇక్కడ అమ్మవారి ఆలయం తో పాటు పక్కన నాగదేవత ఆలయం, ఉత్సవ మూర్తి ఆలయం, అమ్మవారి అద్దాల మండపం కూడా కలవు. ఇక్కడ లడ్డు చాలా బాగా ఉంటుంది.  ఇక్కడ అమ్మవారు రెండు రూపాలలో దర్శనం ఇస్తుంది. ఒక్కటి కింద అమ్మవారూ రెండు శిలా రూపంలో అమ్మవారు. ఈ అలయాలోని ప్రవేశించగానే పసుపు , కుంకుమ వాసన చాలా బాగా వస్తుంది.  ఇక్కడ మొక్కుకుంటే అమ్మవారు ఖచ్చితంగా వల్ల కోరికలు నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసం. ఇక్కడికి రిలైస్ అధినేత గారి సతీమణి వస్తారు. ఇక్కడ మంగళవారం , శుక్రవారం , ఆదివారం రద్దీ అధికంగా ఉంటుంది.  ఇక్కడ కింద అమ్మవారి దగ్గర ఒక చిన్న కొలను ఉన్నది. కేవలం ఒక చిన్న బిందె పడే అంతా ప్లేస్ లో మాత్రమే నీరు వస్తు ఉంటుంది. అలా ఏన్ని సార్లు తీసిన నీరు వస్తూనే ఉంటుంది. ఆ నీరు తాగితే చర్మ సంబంధ రోగాలు, రక్తానికి సంబండిచిన రోగాలు తగ్గుతాయి అని భక్తుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారికి బోనాల పండుగ ప్రతి వారం జరుగుతూనే ఉంటుంది.  ఈ ఆలయంలో ప్రత్యేక ర...

ISKCON Temple | Nampally | Hindu temples guide

Image
  ఈ ఆలయం హైదరాబాద్ లోని నాంపల్లి లో కలదు. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు శ్రీ కృష్ణుడు. ఈ ఆలయం చాలా పెద్దగా ఉంటుంది.  శ్రీ కృష్ణుడి విగ్రహం చూడగానే ఇట్టే ఆకర్షిస్తుంది. అలయాలో ప్రతిరోజూ ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఆలయ సందర్శకులకు ఉచిత భోజనని అందిస్తారు. ఉచితం మాత్రమే కాకుండా మనకి బయట చాలా ప్రాంతాలలో కేవలం 5/- కే బోజనం పెట్టె వారు ఈ సంస్థ వారే నిర్వహిస్తున్నారు.  పౌర్ణమి , రాధా అష్టమి , కృష్ణాష్టమీ , ఇతర పండుగలలో అధిక రద్దీ ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ కృష్ణ భజన చాలా బాగా జరుగుతుంది. ఆడవారు గోపిక వస్త్రధారణలో చాలా బాగా కనిపిస్తారు. కారణం ఈ ఆలయంలో కేవలం సంప్రదాయ దుస్తులలో మాత్రమే పంపిస్తారు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 05:30 నుంచి 01:00  01:00 నుంచి 03:00 వరకు బ్రేక్  సాయంత్రం : 03:00 నుంచి 08:30వరకు  #ISKCON Temple #Nampally #Hindu temples guide #Hyderabad temples

Sri Sita Ramachandraswamy Temple | Shamshabad | Hindu temples guide

Image
  ఈ ఆలయం శంషాబాద్ లోని న్యరుకూడా అనే గ్రామంలో కలదు. హైదరాబాద్ లో అతి ప్రాచీన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ సీత చంద్రరామస్వామి. ఈ ఆలయం చాలా బాగా ఉంటుంది.  ఈ ఆలయాన్ని మీరు చాలా సినిమా లో చూసి ఉంటారు. మురారి అనే సినిమా ఈ ఆలయం లోనే షూటింగ్ చేశారు. అందుకే ఈ ఆలయాన్ని సినిమా ఆలయం అని కూడా అంటారు. ఆలయం బయట పెద్ద ప్రదేశంలో పూల తోటలు కనువిందు చేస్తాయి. శంషాబాద్ నుంచి ఈ ఆలయం 5 కి. మీ దూరంలో కలదు.   ఆలయం బయట పెద్ద కోనేరు కలదు. అక్కడ ఫోటో ఘాట్ లు కూడా జరుగుతాయి. దానికి ప్రత్యేక ధర ఉంటుంది. ఆలయ ప్రారంభం కాగానే రాతి చెక్కబడిన పెద్ద తాబేలు కనిపిస్తుంది. ఈ ఆలయం సుమారు 1000 సం||  క్రితం నిర్మించారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 05:30 నుంచి 01:00  01:00 నుంచి 04:00 బ్రేక్  సాయంత్రం 04:00 నుంచి 08:00 #Sri Sita Ramachandraswamy Temple #Shamshabad #Hindu temples guide #Hyderabad temples 

Sri Jagadguru Adi Shankaracharya’s math | pushpagiri | Begumpet | Dundigal | Hindu temples guide

Image
  ఈ ఆలయం హైదరాబాద్ లోని బేగంపేట లో కలదు. ఇక్కడ ప్రదాన ఆరాధన దేవుడు శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య మహస్వామి వారు. వారి పరంపరలో మిగిలిన శిషులు నడిపిస్తున్నారు.  ఇక్కడ చక్కటి వాతావరణం మనసుకు ఆహాలదాన్ని కలిగిస్తాయి. ఇక్కడ కృష్ణ ఆలయం , దుర్గా దేవి ఆలయం కూడా ఉన్నది. మరియు గోశాల కూడా ఉన్నది. ఉదయం పుట మరియు సాయంత్రం చాలా రద్దీ గా ఉంటుంది. శంకరాచర్య జయంతి చాలా బాగా నిర్వహిస్తారు.  చంద్రమౌళీశ్వర పూజ విశేషంగా జరుగుతుంది. కార్తీక మాసంలో రద్దీ అధికంగా ఉంటుంది. అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా బాగా నిర్వహిస్తారు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:30 వరకు  12:30 నుంచి 04:00 వరకు బ్రేక్  04:00 నుంచి 08:00 వరకు తెరిచి ఉంటుంది.  ఇక్కడి నుంచి సికింద్రాబాద్ ఆలయం కూడా దగ్గరలోనే కలదు. అక్కడి నుంచి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి ఆలయానికి చేరుకోవచ్చు.  #Jagadguru Adi Shankaracharya’s math #pushpagiri #Begumpet #Dundigal #Hindu temples guide

Ujjaini Mahankali Temple | Secunderabad | Hindu temples guide

Image
  ఈ ఆలయం సికింద్రాబాద్ లో కలదు. చాలా ప్రసిద్ది పొందిన ఆలయం. ఈ దేవాలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి మహాకాళి దేవి.  పూర్వం ఆర్మీ లో పని చేసే ఒక సైనికుడు పని నిమ్మతం సికింద్రాబాద్ లో పని చేసుకుంటూ ఉండగా ఆ కాలంలో భయంకర కలరా వ్యాధి వ్యాపించింది. ఈ సమస్య చూసి చలించిపోయిన ఆ సైనికుడు అమ్మవారిని మొక్కుకున్నాడు. ఈ భయంకర కలరా వ్యాధి అందరికీ తగ్గితే ఉజ్జయిని లోని కాళీ ఆలయం వలె ఆలయం నిర్మిస్తాను అని కొద్ది కాలంలోనే ఆ వ్యాధి తగ్గిపోవడం ఆలయం నిర్మించడం అని జరిగిపోయినది. ఇక్కడ బోనాల పండుగ మరియు దసరా పండుగ వైభవంగా జరుతుంది.  ఆలయ సమయం : ఉదయం 04:30 నుంచి 01:00  01:00 నుంచి 3 :00 బ్రేక్  03:00 నుంచి 09:00 వరకు తెరిచి ఉంటుంది.  #Ujjaini Mahankali Temple #Hyderabad famous temples #Secunderabad #Hindu temples guide 

Peddamma Temple | Jubilee Hills | Hindu temples guide

Image
  హైదరాబాద్ లోని ప్రసిద్ద ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒక్కటి. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి పెద్దమ్మ తల్లి. దసరా సమయంలో ఇక్కడ చాలా భారీ ఎత్తున ఉత్సవాలు జరుపుతారు.  దసరా తో పాటు బోనాల పండుగ కూడా చాలా బాగా జరుపుతారు. ఈ ఆలయం ఇంత ప్రసిద్ది కావడానికి ప్రధాన వ్యక్తి  pjr అనే వ్యక్తి. ఈ ఆలయంలో అమ్మవారు సింహా వాహనం పై దర్శనం ఇస్తారు.  ఈ దేవాలయంలో కి ప్రవేశించగానే ప్రశాంతమైన వాతావరణం , ఎక్కువ మంచి కుంకుమ వాసన వస్తాయి. ప్రత్యేకమైన అద్దాల మండపం ని చూడవచ్చు. ఈ ఆలయం దగ్గరలోనే చాలా మంది సినిమా కి సంబండిచిన వ్యక్తుల ఇల్లులు కూడ ఉంటాయి.  ఆలయం దర్శన సమయం : ఉదయం : 05:30 నుంచి 01:00  01:00 నుంచి 04:00 వరకు బ్రేక్  04:00 నుంచి 09:00 వరకు తెరిచి ఉంటుంది.  #Peddamma Temple #Jubilee Hills #Hyderabad temples #Hindu temples guide

Akkanna Madanna Mahankali Temple | Shah-Ali-Banda | Hindu temples guide

Image
  చార్మినార్ నుంచి ఈ ఆలయం 10 కి.మీ దూరంలో కలదు. హైదరబాద్ లోని ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. సుమారు ఈ ఆలయం 400 సం|| ముందు గల ఆలయం. హైదరాబాద్ ని పరిపాలించిన ఉస్మాన్ ఫాష గారి వద్ద ఈ వీరు మంత్రులుగా ఉండే వారు. కానీ ఇక్కడ వీరు పేరు మీద ఆలయం ఉన్న ఇక్కడ ప్రధాన దేవత మాత్రం మహాకాళి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో  ప్రధానంగా తెలంగాణ సంప్రధయ పండుగ ఐన బోనాల పండుగా అంగరంగా వైభవంగా జరుగుతుంది.  బోనాల పండుగలతో పాటుగా దసరా , దీపావళి , మొదలగు పండుగలు కూడా ఘనంగా జరుపుకుంటారు. పురాతన ఆలయం కానీ చాలా శక్తివంతమైన ఆలయం.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 05:30 నుంచి  12:30 వరకు  01:00 నుంచి 04:00 వరకు బ్రేక్  04:30 నుంచి 08:00 వరకు  బోనాల పండుగ , దసరా , దీపావళి సమాయంలో ఖచ్చితంగా ధర్శంచలి.    #Akkanna Madanna Mahankali Temple #Hyderabad temples #Hindu temples guide 

Karmanghat Hanuman Temple | Karmanghat | Hindu temples guide

Image
  ఈ ఆలయం కర్మానఘట్ట అనే ప్రాంతం వద్ద కలదు. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ ఆంజనేయ స్వామి. ఎంతో మహిమ గల ఆలయం. నూతనంగా కొన్న వాహనాలు , టూ వెహిలర్ త్రీ వెహిలర్ , ఫోర్ వెహిలర్ , భారీ నుంచి అతి భారీ వాహనాల వరకు ఈ ఆలయంలో పూజ చేపించడం ఇక్కడ ప్రత్యేకత.  ఈ ఆలయాన్నికి ప్రత్యేక చరిత్ర కలదు. వేరే రాజ్య చక్రవర్తి ఈ ఆలయాన్ని ద్వంసం చేయడాన్నికి 1500 మంది ఈ ఆలయాన్ని కూల్చడాన్నికి వస్తే ఆ రాజు తో సహ వారు అందరూ ఆలయం బయటనే స్పృహ తప్పి పడిపోయారు. ఆలయం లోపలికి కూడా రాలేదు. ఆలయం లోపల నుంచి శ్రీ ఆంజనేయ స్వామి రాజుకి ఒక భాయనకర శబ్దం తో పరిపో అనే శబ్దం వినిపించినది. అప్పటి నుంచి ఆ రాజు ఈ ఆలయం వైపు కన్ను ఎత్తి కూడా చూడకుండా పారిపోయాడు.  ఆలయం లోపల ప్రశాంత వాతావారణం ఉంటుంది. శనివారం పండుగల సమయంలో అధిక రద్దీ ఉంటుంది.   దర్శన సమయం : ఉదయం 06:00 నుంచి 01:00  01:00 -03:00 వరకు బ్రేక్  సాయంత్రం 03:30 నుంచి 08:00 వరకు తెరిచి ఉంటుంది.   #Karmanghat hanuman temple #Hanuman #Hindu temples guide #Hyderabad temples #top hyderabad temple 

SABARIMALA YATRA | Bharat Gaurav (SCZBG32) | Hindu temples guide

Image
  శబరిమల యాత్ర భారత్ గౌరవ్ రైలు :  శబరిమల వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ గౌరవ్ పేరుతో ప్రత్యేక రైలును నడుపుతోంది. మొత్తం 4 రాత్రులు, 5 పగళ్ల ప్యాకేజీతో ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రైలు నవంబర్ 16న సికింద్రాబాద్‌లో బయలుదేరి పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, గూడూరు మీదుగా శబరిమల అయ్యప్ప చోట్టనిక్కర దేవి ఆలయానికి చేరుతుంది. 20వ తేదీన తిరుగు ప్రయాణం అవుతుంది. టీ, టిఫిన్, భోజనం, ఏపీ, నాన్ ఏసీ, ప్రయాణికులకు బీమాతో కలిపి టికెట్ ధర ఒక్కొక్కరికి స్లీపర్ క్లాసులో రూ.11,475, థర్డ్ ఏసీలో రూ.18,790, సెకెండ్ ఏసీలో రూ.24,215 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు 82879 32312, 92814 95848 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని రైల్వే అధికారులు వివరించారు. అయ్యప్ప భక్తులు ఈ సర్వీసును వినియోగించుకోవాలని సూచించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. గతంలోనూ శబరిమలకు పలు ప్రత్యేక రైళ్లను నడిపారు. ముఖ్యంగా మకర జ్యోతి దర్శనం సమయంలో శబరిమలకు ఎక్కువ మంది వెళ్తుంటారు. వారి కోసం నవంబర్ నెల ఎండింగ్ న...

Jagannath Temple | Banjara Hills | Hindu temples guide

Image
  ఈ ఆలయం హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో కలదు. హైదరాబాద్లో ఉన్న పురాతన అలయల్లాలో ఈ ఆలయం ఒకటి.  ఆలయ ఆకృతి , శిల్ప కల వైభవం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. చక్కటి వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది. ఒరిస్సా లోని జగన్నాథ స్వామి ఆలయం పోలి ఈ ఆలయం ఉంటుంది. హైదరాబాద్లో చూడవలసిన అలయాలో ఈ ఆలయం ఒకటి.  ఆలయ దర్శన సమయం :  ప్రతి రోజు ఉదయం 05:00 నుంచి మధ్యాన్నం 12:00 వరకు.  12:00 నుంచి 04:00 వరకు బ్రేక్  సాయంత్రం 04:00 నుంచి 08:00 వరకు తేరిచి ఉంటుంది.  ఈ ఆలయంలో దగ్గరలోనే టి టి డి వారి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ కూడా ఉంటుంది. తిరుమలో ఉన్నమ అనే విధంగా ఉంటుంది. #Jagannath Temple #Banjara Hills #Hindu temples guid

sankashti chaturthi spl | Hindu temples guide

Image
  సంకష్టహరచతుర్థి :  ఈ రోజు అనగా పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకష్టహర చతుర్థి రోజున అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కడపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి....

Atla taddiya | Hindu temples guide

Image
  అట్ల తదియ (చంద్రోదయ గౌరీ వ్రతం) : అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా పట్టు పావడాలు కట్టిన పల్లె పడుచులు. తమ ఆశలు ప్రతిఫలించేలా, నవవధువులు ముత్తైదు భాగ్యాలు సిద్ధించేలా, కరచరణాలకు నఖరంజని ధరిస్తారు. తెలుగు లోగిళ్లకు, తోటలకు సరికొత్త అందాలు తెస్తారు. ఆధ్యాత్మిక శోభకు పట్టం కడతారు. కన్నెలు, నవవధువులు చేసే సరదాల సందళ్లు చూసే కన్నులు వెలుగులై, మనసు ముగ్ధమయ్యే కమనీయ రమణీయ పర్వం అట్లతద్ది. అట్లతద్ది ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి వెళ్లిన మూడో రోజు వస్తుంది. పెళ్లైన స్త్రీలు ఐదవతనం కోసం, కన్నె పిల్లలు మంచి భర్త కోసం అట్లతద్ది నోము నోచుకోవడం ఆనవాయితీగా కనిపిస్తుంది. అట్లతద్ది రోజున తెల్లవారు జామునే లేచి, స్నానాలు చేసి చద్దిభోజనం చేస్తారు. పగలంతా భోజనం చేయరు. పగలంతా తోటలవెంట చెలులతో ఆట పాటలతో గడిపి సాయంవేళకు ఇళ్లకు చేరుకుంటారు. పొద్దువాలిన తరువాత పదకొండు మంది ముత్తైదువులను ఆహ్వానిస్తారు. పూజగదిలో కలశం ప్రతిష్టించి గౌరీదేవిని ఆవాహన చేసి పూజిస్తారు. పూజలో తులసీదళం, తమలపాకులు తప్పనిసరిగా వినియోగిస్తారు. ఆ ఆకులతో 11 ముళ్లు వేసి చేతులకు తోరాలు కట్టుకుంటారు. అనంతరం అట్లతద్ది కథ చదువుకుంటారు. కథ పూర్తైన తర్వాత అమ...

Valmiki Jayanthi | Hindu temples guide

Image
  ఆశ్వయుజ పూర్ణిమ – వాల్మీకి జయంతి : సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కధ. దీనిని "సీతాయాశ్చరితం మహత్" అని వాల్మీకి అన్నాడు. 24,000 శ్లోకములతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శజీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును. రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు)గా విభజింప బడినది. వాల్మీకి వ్రాసిన రామాయణం రాముని కధకు ప్రధానమైన ఆధారం. ఇంతే గాక విష్ణుపురాణములో రాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారము అని చెప్పారు. భాగవతం నవమ స్కంధములో 10, 11 అధ్యాయాలలో రాముని కధ సంగ్రహంగా ఉంది. మహాభారతంలో రాముని గురించిన అనేక గాధలున్నాయి. వాల్మీకి సంస్కృతంలో ఆదికవి. రామాయణాన్ని వ్రాశాడు. వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవి...

Aashwayuja purnima | Hindu temples guide

Image
 ఆశ్వియుజ పూర్ణిమ : ఈ రోజు ఆశ్వీయుజ పూర్ణిమకే 'శరత్ పూర్ణిమ' అని పేరు. అమ్మవారి ఆరాధనకు, శివ అభిషేకం , విష్ణు సహస్రనామ స్తోత్రం , దక్షిణామూర్తి అభిషేకం , అరుణాచల గిరి ప్రదక్షిణకి చాలా విశేషమైన రోజు. సాధారణంగా అందరూ దేవీ నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ పూర్ణిమనాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అని పూర్ణిమ కంటే ఈ రోజు చంద్రుడు మరింత కాంతి వంతంగా కనిపిస్తాడు.  అందువల్ల ఈరోజు చంద్రుడిని పూజిస్తే ఎంతో పుణ్యం. ఈ శరత్ పూర్ణిమ రోజున చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. ఈ కిరణాలు శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువల్ల చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణం చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు.  చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెబుతోంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాలలో ఉన్న ఓషధీతత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మర్నాడు ఉదయం పర...

Paidithalli sirimanosthavam | Vijayanagaram | Hindu temples guide

Image
 విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం : విజయనగరం పైడిమాంబ ఉత్తరాంధ్ర ప్రజలకు ఇలవేల్పు. పైడిమాంబ సిరిమానోత్సవానికి దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు విచ్చేస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి పదహారు రోజుల పాటు పైడితల్లి అమ్మవారి ఉత్సవం కన్నులపండువగా జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో విజయదశమి తరువాత వచ్చే మంగళవారంనాడు నిర్వహించే సిరిమానోత్సవం ప్రధానం.  పైడితల్లి అమ్మవారికి తొలి సిరిమానోత్సవాన్ని 1758లో నిర్వహించారు. 50 అడుగులు పొడవుండే సిరిమానుకు చివర.. అమ్మవారి రూపంలో పూజారి కూర్చునే విధంగా ఆసనం ఏర్పాటు చేస్తారు. సిరిమానును ఒకబండిపై అమర్చుతారు. సిరిమానుపై అధిష్టించిన పైడితల్లి తిరువీధుల్లో విహరిస్తూ ముమ్మారు కోటశక్తికి ప్రణమిల్లుతుంది. సిరిమానోత్సవం ప్రధానంగా రైతుల ఉత్సవం. అమ్మవారి వద్ద ఉంచిన విత్తనాలు రైతులందరికీ ఇస్తారు. బెస్తవారి వల, ఈటెలు - బల్లేలు, తెల్లఏనుగు వంటివి సిరిమానోత్సవం చూడదగిన విశేషాలు.  సిరిమానోత్సవం తరువాతి మంగళవారంనాడు పెద్ద చెరువులో తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆ తరువాత వచ్చే మంగళవారం రాత్రి ఉయ్యాల కంబాలతో పదహారు రోజుల ఉత్సవం పూర్తవు తుంది. ముగింపు వేడుకలో భాగంగా అమ్మ...

Sri anantha padbhanabha swami | Vikarabad | Hindu temples guide

Image
 వికారాబాదు సమీపంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కలదు. దీనిని అనంతగిరి అనంతపద్మనాభ స్వామి దేవాలయం అని అంటరు. ఇది ప్రాచీన దేవాలయాల్లో ఇది ఒకటి. ఇది హైదరాబాద్‌కి 75 కిలో మీటర్ల దూరంలో, వికారాబాద్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండల్లో వెలసింది. స్కంద పురాణం ప్రకారం ఈ దేవాలయం ద్వాపర యుగంలో "మార్కండేయ" ఋషి నిర్మించాడని ప్రతీతి. ఈ ప్రాంతంలోని ప్రశాంతమైన వాతావరనానికి ఆకర్షితుడైన మార్కండేయ ముని అనంతగిరి కొండలలో యోగ సాధన చేయుటకు సంకల్పిస్తాడు. ప్రతి రోజూ మార్కండేయ ముని తన యోగ సాధనతో అనంతగిరి నుండి కాశీ వెళ్ళి గంగా నదిలో పవిత్ర స్నానమాచరించేవాడు.  ఒక రోజు ఉదయం ప్రాతః కాలంలో ద్వాదశి ప్రవేశించుట వలన ఆయన కాశీకి వెళ్లలేకపోతాడు. శివుడు ఆయన స్వప్నంలో దర్శనమిచ్చి ఆయనకు గంగా జలాన్ని స్నానమాచరించుటకు ఏర్పాట్లు చేస్తాడు. ఈ ఆలయం ఉదయం 6:00 నుంచి సాయంత్రం 07:00 వరకు తెరిచి ఉంటుంది. మహబూబ్నగర్ , వనపర్తి , హైదరాబాద్ నుంచి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. వర్ష కాలం మరియు చలి కాలం ఈ ఆలయం మరింత అందంగా కనిపిస్తుంది. ఇక్కడ కొండలే ప్రత్యేక ఆకర్షణ. సినిమా షూటింగ్ లు కూడా అధికంగా జరుగుతాయి.  #...

Alampur jogulamba temple | Hindu temples guide

Image
ఈ ఆలయం అష్టదశ శక్తి పీఠాలలో ఐదవది. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ గా కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శంకరుడు బాలాబరమేశ్వర. ఈ ఆలయం రోజు ఉదయం 5 గంటలకి తెరుచుకొని 12:00 వరకు ఉటుంది. తీరిగీ సాయంత్రం 3:30 రాత్రి 7:00 వరకు ఉంటుంది. ఈ ఆలయం లో అమ్మవారుని ఎదురుగా నిలబడి చూడకుడదు. అందుకు కారణం ఇక్కడ అమ్మవారు చాలా శక్తి వంతంగా ఉంటుంది. ఈ ఆలయం కి చేరుకోవడానికి డైరెక్ట్ బస్ మరియు ట్రైన్ సౌకర్యం కూడా కలదు. గద్వాల జిల్లా అలాంపుర్ గ్రామంలో ఈ ఆలయం కలదు. ఇక్కడి ఆలయం పూర్తిగా ఎర్రటి రాతి తో నిర్మయిచ్చారు.  #Hindu temples guide   

Sri Rajarajeshwari devi ashtothara shatanamavali | Hindu temples guide

Image
  శారదా నవరాత్రులు : ఇంద్రకీలాద్రి పై ఈ రోజు సకల లోకాలకు ఆరాధ్య దేవత శ్రీ రాజరాజేశ్వరిగా అమ్మవారి అలంకరణ.  - శ్రీ రాజరాజేశ్వరీదేవి :  - ఓం శ్రీ భువనేశ్వర్యై నమః ఓం రాజేశ్వర్యై నమః ఓం రాజరాజేశ్వర్యై నమః ఓం కామేశ్వర్యై నమః ఓం బాలాత్రిపురసుందర్యై నమః ఓం సర్వైశ్వర్యై నమః ఓం కళ్యాణైశ్వర్యై నమః ఓం సర్వసంక్షోభిణ్యై నమః ఓం సర్వలోక శరీరిణ్యై నమః ఓం సౌగంధికమిళద్వేష్ట్యై నమః ఓం మంత్రిణ్యై నమః ఓం మంత్రరూపిణ్యై నమః ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం సౌభాగ్యవత్యై నమః ఓం పద్మావత్యై నమః ఓం భగవత్యై నమః ఓం శ్రీమత్యై నమః ఓం సత్యవత్యై నమః ఓం ప్రియకృత్యై నమః ఓం మాయాయై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం సర్వలోకమొహనాధీశాన్యై నమః ఓం కింకరీ భూత గీర్వాణ్యై నమః ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః ఓం పురాణాగమ రూపిణ్యై నమః ఓం పంచ ప్రణవ రూపిణ్యై నమః ఓం సర్వ గ్రహ రూపిణ్యై నమః ఓం రక్త గంధ కస్తూరీ విలే పన్యై నమః ఓం నాయక్యై నమః ఓం శరణ్యాయై నమః ఓం నిఖిలవిద్యేశ్వర్యై నమః ఓం జనేశ్వర్యై నమః ఓం భుతేశ్వర్యై నమః ఓం సర్వసాక్షిణ్యై నమః ఓం క్షేమకారిణ్యై నమః ఓం పుణ్యాయై నమః ఓం సర్వ రక్షణ్యై నమః ఓం సకల ధారిణ్యై నమః ఓం ...

Sri Rajarajeshwari devi | Hindu temples guide

Image
  శారదా నవరాత్రులు : ఇంద్రకీలాద్రి పై ఈ రోజు సకల లోకాలకు ఆరాధ్య దేవత శ్రీ రాజరాజేశ్వరిగా అమ్మవారి అలంకరణ.  - శ్రీ రాజరాజేశ్వరీదేవి : - అంబా శాంభవి చంద్రమౌళీ రబలా వర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతీ శివా త్రిణయనీ కాత్యాయనీభైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మి ప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి - శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మాండాలకు రాజరాజేశ్వరీ దేవి ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో  పూజలందుకుంటుంది.  ఈ దేవిని "అపరాజితాదేవి"గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. #పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది.  ఈమె యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత. "ఐం క ఏ ఈల హ్రీం, క్లీం హసకహల హ్రీం సౌ: సకల హ్రీం" అనే మంత్రం జపించాలి. లలితా సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన చేయాలి....

Sri Mahishasura Mardhini devi ashtotharam | Hindu temples guide

Image
  శ్రీ మహిషాసుర మర్దిని దేవి అష్టోత్తరం : ఓం మహత్యై నమః ఓం చేతనాయై నమః ఓం మాయాయై నమః ఓం మహాగౌర్యై నమః ఓం మహేశ్వర్యై నమః ఓం మహోదరాయై నమః ఓం మహాబుద్ధ్యై నమః ఓం మహాకాళ్యై నమః ఓం మహా బలాయై నమః ఓం మహా సుధాయై నమః ఓం మహా నిద్రాయై నమః ఓం మహా ముద్రాయై నమః ఓం మహా దయాయై నమః ఓం మహా భోగాయై నమః ఓం మహా మోహాయై నమః ఓం మహా జయాయై నమః ఓం మహాతుష్ట్యై నమః ఓం మహా లజ్జాయై నమః ఓం మహాధృత్యై నమః ఓం మహా ఘోరాయై నమః ఓం మహా దృష్ట్రాయై నమః  ఓం మహాకాంత్యై నమః ఓం మహాకృత్యై నమః ఓం మహా పద్మాయై నమః ఓం మహా మేధాయై నమః ఓం మహా బోధాయై నమః ఓం మహా తపసే నమః ఓం మహా స్థానాయై నమః ఓం మహా రవాయై నమః ఓం మహా రోషాయై నమః ఓం మహాయుధాయై నమః ఓం మహా బంధన సంహర్యై నమః ఓం మహాభయ వినాశిన్యై నమః ఓం మహా నేత్రాయై నమః ఓం మహా వక్త్రాయై నమః ఓం మహా వక్షసే నమః ఓం మహా భుజాయై నమః ఓం మహా మహీరుహాయై నమః ఓం పూర్ణాయై నమః ఓం మహా ఛాయాయై నమః ఓం మహానఘాయై నమః ఓం మహాశాంత్యై నమః ఓం మహాశ్వాసాయై నమః ఓం మహా పర్వత నందిన్యై నమః ఓం మహా బ్రహ్మమయ్యై నమః ఓం మాత్రే నమః ఓం మహా సారాయై నమః ఓం మహా సురఘ్న్యై నమః ఓం మహత్యై నమః ఓం పార్వత్యై నమః ఓం చర్చితాయై నమః ఓం శివాయై నమః ఓం ...

Sri Mahishasura Mardhini devi | Hindu temples guide

Image
  శారదా నవరాత్రులలో నేడు 9 వ రోజు ఈ రోజు అమ్మవారి అలంకారం : శ్రీ మహిషాసుర మర్ధని దేవి ఆశ్వయుజ శుద్ధ నవమి. శ్రీ మహిషాసుర మర్దనీ దేవి శ్లోకం :  అయిగిరినందిని నందితమోదిని, విశ్వవినోదిని నందినుతే  గిరివర వింధ్య శిరోధిని వాసిని, విష్ణువిలాసిని జిష్ణునుతే |  భగవతి హే శితికంఠ కుటుంటిని, భూరికుటుంబిని భూరికృతే  జయజయహే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ॥ శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహిషాసుర మర్దనీ దేవి గా దర్శనమిస్తారు.  అష్టభూజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురిడిని సంహరించి శ్రీదుర్గాదేవి దేవతల, ఋషుల, మానవులు కష్టాలను తొలగించింది.  మహిషాసురమర్దనీ దేవి అలంకారములో ఉన్న శ్రీ అమ్మవారిని దర్శించడం వలన అరిష్టాలు నశిస్తాయి. సాత్వికభావం ఉదయిస్తుంది. సర్వదోషాలు పటాపంచలు అవుతాయి. ధైర్య స్థైర్య, విజయాలు చేకూరుతాయి..! లలితా సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన చేయాలి. సువాసినీ పూజ చేయాలి. అవకాశం ఉంటే శ్రీ చక్రార్చన చేస్తే మంచిది. నైవేద్యం - పులీహోర.  #Hindu temples guide #Dasara #Vijayawada 

Sri Durgaashtakam | Vijayawada | Hindu temples guide

Image
  శ్రీదుర్గాఅష్టకం: కాత్యాయని మహామాయే ఖడ్గబాణధనుర్ధరే | ఖడ్గధారిణి చండి దుర్గాదేవి నమోఽస్తు తే || 1 || వసుదేవసుతే కాళి వాసుదేవసహోదరి | వసున్ధరాశ్రియే నన్దే దుర్గాదేవి నమోఽస్తు తే || 2 || యోగనిద్రే మహానిద్రే యోగమాయే మహేశ్వరి | యోగసిద్ధికరీ శుద్ధే దుర్గాదేవి నమోఽస్తు తే || 3 || శఙ్ఖచక్రగదాపాణే శార్ఙ్గజ్యాయతబాహవే | పీతాంబరధరే ధన్యే దుర్గాదేవి నమోఽస్తు తే || 4 || ఋగ్యజుస్సామాథర్వాణశ్చతుస్సామన్తలోకిని| బ్రహ్మస్వరూపిణి బ్రాహ్మి దుర్గాదేవి నమోఽస్తు తే || 5 || వృష్ణీనాం కులసంభూతే విష్ణునాథసహోదరి | వృష్ణిరూపధరే ధన్యే దుర్గాదేవి నమోఽస్తు తే || 6 || సర్వజ్ఞే సర్వగే శర్వే సర్వేశే సర్వసాక్షిణి | సర్వామృతజటాభారే దుర్గాదేవి నమోఽస్తు తే || 7 || అష్టబాహు మహాసత్త్వే అష్టమీ నవమి ప్రియే | అట్టహాసప్రియే భద్రే దుర్గాదేవి నమోఽస్తు తే || 8 || దుర్గాష్టకమిదం పుణ్యం భక్తితో యః పఠేన్నరః | సర్వకామమవాప్నోతి దుర్గాలోకం స గచ్ఛతి || 9 | ఈరోజు అలకారం శ్రీ దుర్గా దేవి. #Hindu temples guide #Dasara #Vijayawada

Sri Durga devi | Hindu temples guide

Image
  శారదా నవరాత్రులు : ఇంద్రకీలాద్రి ఈ రోజు అమ్మవారి అలంకారం : శ్రీ కనకదుర్గా దేవి (దుర్గాష్టమి). విద్యుద్దామ సమప్రభాం  మృగపతి స్కందస్థితాం భీషణా౦  కన్యాభి: కరవాలఖేల విలద్దస్తా భిరాసేవితాం!  హసైశ్చక్రగదాసిఖేట  విసిఖాంశ్చాపం గుణం తర్జనీం  బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం  దుర్గం త్రినేత్రం భజే దుర్గా వర్ణన , సింహాన్ని తన వాహనంగా చేసుకొని శత్రువులని సంహరించి , శివునికి సంతోషాన్ని కలిగించేది , తనకు నమస్కరించిన భక్తులకి ముక్తిని ప్రశయించేది ఐన కామాక్షి దేవి సాక్షాతూ దుర్గా దేవి స్వరూపమే.  దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రుల్లో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది.ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవులను ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది.  కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. అమ్మ నామాన్ని జపిస్తే సకల గ్రహ బాధలు తొలగిపోతాయి. ఆరాధకులకు దుర్గాదేవి శీఘ్ర అనుగ్రహ...

Sri Saraswathi devi Aashtotara shatanamavali | Hindu temples guide

Image
  శారదా నవరాత్రులు : ఇంద్రకీలాద్రి. అమ్మవారి అలంకారం : శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం). ''యా కుందేందు తుషారహార దవళా యాశుభ్ర వస్త్రాన్వితా  యా వీణా వరదండ మండిత కరా యశ్వేత పద్మాసనా  యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతి భిర్దేవైస్సదా పూజితా  సమాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా" సరస్వతీ అష్టోత్తర శత నామావళి ఓం శ్రీ సరస్వత్యై నమః ఓం మహాభద్రాయై నమః ఓం మహామాయాయై నమః ఓం వరప్రదాయై నమః ఓం శ్రీప్రదాయై నమః ఓం పద్మనిలయాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మవక్త్రికాయై నమః ఓం శివానుజాయై నమః ఓం పుస్తకహస్తాయై నమః (10) ఓం జ్ఞానముద్రాయై నమః ఓం రమాయై నమః ఓం కామరూపాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం మహాపాతక నాశిన్యై నమః ఓం మహాశ్రయాయై నమః ఓం మాలిన్యై నమః ఓం మహాభోగాయై నమః ఓం మహాభుజాయై నమః ఓం మహాభాగాయై నమః (20) ఓం మహోత్సాహాయై నమః ఓం దివ్యాంగాయై నమః ఓం సురవందితాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం మహాపాశాయై నమః ఓం మహాకారాయై నమః ఓం మహాంకుశాయై నమః ఓం సీతాయై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వాయై నమః (30) ఓం విద్యున్మాలాయై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం చంద్రికాయై నమః ఓం చంద్రలేఖావిభూషితాయై నమః ఓం మహాఫలాయై నమః ఓం సావిత్ర్యై నమః ...

Sri Saraswathi devi | Hindu temples guide

Image
  శారదా నవరాత్రులు : ఇంద్రకీలాద్రి. అమ్మవారి అలంకారం : శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం). - ''యా కుందేందు తుషారహార దవళా యాశుభ్ర వస్త్రాన్వితా  యా వీణా వరదండ మండిత కరా యశ్వేత పద్మాసనా  యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతి భిర్దేవైస్సదా పూజితా  సమాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా" సరస్వతి ఎడమ చేత్తో పుస్తకములు పట్టుకొన్ని ఉంటుంది. కుడి చేత్తో రుద్రాక్షమాల లేదా స్పటిక మాల పట్టుకొని ఉంటుంది. ఎడమ చేతి వైపు ఉన్నది ఏది ఉన్నదో ఆది కుడి చేతి వైపు పట్టుకొని ఉన్న దానికన్నా గొప్పది కాకపోవచ్చు. పుస్తకాలు చదవడం మంచిదే కానీ ఏప్పుడు కేవలం చదవడం కన్నా చదివినది మనస్సు లో జ్ఞాపకం తెచ్చుకోవడం ఎతో ఉత్తమం. అలా జరగాలి అంటే ఎప్పుడు జపమాల వలె మననం చేస్తూ ఉండాలి. అందుకు గుర్తుగా అమ్మవారు జపమాల కుడి చేతితో పట్టుకొని ఉంటుంది.  సరస్వతీ దేవిని అర్చిస్తే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. బుద్ధి వికాసం జరుగుతుంది. త్రిశక్తి స్వరూపాలలో ఈ అమ్మ మూడవ శక్తి. సరస్వతీ దేవత విద్యార్థుల పాలిట కల్పవల్లి.  నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున అమ్మ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. జ్ఞానానికి అధిష్టా...

Sri Bagyalaxmi devi | Charminar | Hindu temples guide

Image
  చార్మినార్ వద్ద వెలసిన శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారు. చార్మినార్ కంటే మొదటనే ఇక్కడ ఈ అమ్మవారు వెలిసి ఉన్నారు. ఈ అమ్మవారి పేరు మీదనే మొదట హైదరాబాద్ కి భాగ్యనగరం అనే పేరు ఉన్నది. కానీ కాలక్రమేనే ఆది మారిపోయింది. ఇక్కడ దసరా మరియు దీపావళి ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతాయి.  ఈరోజు అలంకారము శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు.   శ్రీ మహాలక్ష్మ్యష్టకం :  ఇంద్ర ఉవాచ :  నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే । శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 1 ॥ నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి । సర్వపాపహరే దేవి* *మహాలక్ష్మి నమోఽస్తు తే॥ 2 ॥ సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి । సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 3 ॥ సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని । మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 4 ॥ ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి । యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 5 ॥ స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే । మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 6 ॥ పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి । పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 7 ॥ శ్వేతాంబర...

Sri Mahalaxmi Devi | Hindu temples guide

Image
ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీ దేవి  అమ్మవారి అలంకారము. శ్రీ మహాలక్ష్మీ దేవి. అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, కమలాలను రెండు చేతులతో ధరించి, గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మీ రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ దేవి సర్వమంగళ కారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. ఈమె క్షీరాబ్ధి పుత్రిక. డోలాసురుడనే రాక్షసుడిని సంహరించిన దేవత మహాలక్ష్మి. శక్తి త్రయంలో ఈమె మధ్య శక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. "యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా" అంతే అన్ని జీవులలోను ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీసప్తశతి చెబుతోంది.  కాబట్టి శరన్నవరాత్రులలో దుర్గాదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. అమ్మవారికి వడపప్పు, చలివిడి నివేదన చేయాలి. నైవేద్యం - వడపప్పు,క్షీరాన్నం. ధ్యానమ్ వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం  హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్ | భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః || సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమ...

Sri Chandika devi | Hindu temples guide

Image
  ఓం శ్రీ మహాచండీ దేవియై నమః  విజయవాడ దుర్గమ్మ అవతారం చండీ అవతారం . ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహా చండీ దేవిగా దర్శనం ఇస్తున్నారు. చండీ దేవి అమ్మవారు ఒక్కోసారి శాంతంగా ఒక్కోసారి రౌద్రంగా దర్శనం ఇస్తారు. శాంతంగా.. దయగల రూపంలో ఉన్న అమ్మవారిని గౌరీ, పార్వతి, హైమవతి, శతాక్షి, శాకంభరి దేవీ, జగన్మాత, భవాని అని పిలుస్తారు. రౌద్రంగా ఉన్నప్పుడు దుర్గ, కాళి, శ్యామ, చండీ, చండిక, భైరవి అని పిలుస్తారు. శ్రీ మహా చండీ అమ్మవారిని ఈరోజు ఎరుపురంగు చీరలో అలంకరిస్తారు. పసుపు రంగు పూవులతో పూజ చేస్తారు. చండీ, దుర్గా సప్తశతి చదివితే మంచిది. అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టాలి. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి ధైర్యం, విజయం సిద్ధిస్తుంది. హరిద్వార్ లో ఉన్న చండీ దేవీ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. రాక్షస సంహారం తర్వాత అమ్మవారు ఇక్కడ స్థిరపడింది. ఇక్కడ ఆలయంలో విగ్రహాన్ని ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్టించారని చెబుతారు. నవరాత్రుల్లో అష్టమి, నవమిలలో ప్రత్యేక పూజలు చేస్తారు. నవరాత్రుల్లో శ్రీ మహా చండీ దేవిని దర్శించుకుంటే మనసులోని కోర్కెలు తీరతాయని భక్తులు విశ్వసిస్తారు. #Hindu temples guide #dasara

Sri lalitha tripura sundari devi | Hindu temples guide

Image
  ఇవాళ అమ్మవారి అలంకారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి :  ప్రాతర్నమామి లలితా చరణారవిందం  భక్తేష్టదాన నిరతం భవసింధుపోతమ్||| పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశ ధ్వజ సుదర్శన లాంఛనాఢ్యమ్ 🙏 #Hindu temples guide #dasar 

Annapoora devi | Hindu temples guide

Image
  శ్రీ అన్నపూర్ణా దేవి : నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ | ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||  అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చెయ్యాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. #ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది.  అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. #భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది. ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచైన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం. అమ్మవారిని తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి. " హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి.  అమ్మ...

Gayatri devi | Hindu temples guide

Image
  శ్రీ గాయత్రి దేవి :  ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు._ దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని. అగ్ని నుం...డి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హ్రుతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతున్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు. గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు: 01. వినాయకుడు*: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు. 02. నృసింహ స్వామి*: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే. 03. విష్ణుమూర్తి:* పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు. 04. ఈశ్వరుడు*: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు. 05. శ్రీకృష్ణుడు*: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్...

Sri Balatripurasunari devi | Hindu temples guide

Image
  బాల త్రిపుర సుందరి దేవి :  ప్రపంచంలోని ప్రతి స్రి అమ్మ ప్రతి రూపమే. మొదట అమ్మవారు బాలగా వచ్చునని ప్రతీతి. త్రిపురిని భార్య అంటే ఈశ్వరుని భార్య ఐన గౌరి దేవి అని అర్ధం. మనస్సు బుద్ది , చిత్తం , అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి.  అభయ హస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాదీస్తే  మానసిక బాధలు తొలిగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరి దేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విధ్య కి ఈ అమ్మవారు అధి దేవత. కాబట్టి ఉపశకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాల అర్చన చేస్తారు. మనము ఎన్ని జన్మలు ఎత్తిన ఈ ముడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది.ఆవిడ ఆత్మ స్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివ స్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది. బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో, లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. భండాసురుడు అనే రాక్షసునకు ముప్ఫై మంది పిల్లలు. వీళ్ళందరు అవిద్యా వృత్తులకు సంకేతం. లలిత సహస్ర న...

Kanaka durga devi | Vijayawada

Image
“ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే” శ్రీ అమ్మవారి స్ధల పురాణం :  విజయవాడ పట్టణంలో దుర్గాదేవి వెలసిన పర్వతం పేరు ఇంద్రకీలాద్రి, పర్వత రూపుడైన కీలుడు దుర్గాదేవి ఉపాసకుడు. ఆ దుర్గాదేవిని తన హృదయ కుహరంలో (గుహలో) నివశించమని అపార తపస్సు చేశాడు. కీలుని భక్తికి కరుణారస ప్రపూర్ణ అయిన జగదంబ దుర్గ కనకదుర్గగా వాని హృదయ కుహరంలో స్వయంభువుగా వెలసింది. స్వర్ణ మణిమయ కాంతులతో ప్రకాశిస్తున్న ఆ కనకదుర్గను ఇంద్రాది దేవతలు వచ్చి, శ్రీ కృష్ణ రూపిణి అయిన కృష్ణవేణీ నదిలో స్నానమాడి కనక దుర్గను పూజించి ప్రణమిల్లారు. నాటి నుండి కీలాద్రి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. దుర్గమాసురుని సంహరించిన దుర్గ కీలాద్రిన నిలచిపోగా ఈశ్వరుడు జ్యోతిర్లింగ రూపముతో స్వయంభువుడుగా ఈ ఇంద్రకీలాద్రి మీద వెలశాడు. బ్రహ్మాది దేవతలు ఆ లింగమును మల్లికా కదంబ పుష్ఫాలతో పూజించగా అప్పటి నుండి మల్లేశ్వరుడుగా పిలువబడుతున్నాడు. అర్జునుడు ఈ కీలాద్రి మీద తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొంది విజయడైనాడు. కనుక ఈ క్షేత్రానికి ఫల్గున క్షేత్రమని, విజయపురి అనే పేర్లు పురాణ ప్రసిద్ధాలైనాయి....