Naraka chaturdasi | Deepavalli | Hindu temples guide

 

నరకచతుర్దశి : 

నరకచతుర్దశి సూర్యోదయానికి ముందే లేచి తైలాంభ్యంగన స్నానం- తె.4.30 నుంచి ఉ.5.30లోపు చేయాలి. 

నరకచతుర్దశినాడు సూర్యోదయానికి ముందే లేచి, నువ్వుల నూనెతో తలంటుకొని, వేడినీళ్ళతో అభ్యంగన స్నాన మాచరిస్తారు. మహారాష్ట్రలో ‘ఉప్తాన్’ అనే శనగపిండితో తలస్నానం చేస్తారు. నూతన వస్త్రాలు ధరిస్తారు.  

ఈ రోజు యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయచ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షమాయచ ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమాత్మనే... అని యమనామాలు పఠించి, తర్పణాలు వదిలితే, అకాల మృత్యుదోషాలు తొలుగుతాయి. 

పూర్వకాలంలో గోగుకొమ్మ లేక ఆముదపు కొమ్మకు నూనెలో తడిపిన నూలు వస్త్రంలో నల్లనువ్వులు చిన్నమూటగా కట్టి, వెలిగించి, పిల్లలకు దిష్టితీసి, ఉత్తరం నుండి దక్షిణం వైపుగా తిప్పి పడేసేవారు. దీనిని ‘ఉల్కాదానం’ లేదా దివిటీలు వెలిగించడం అంటారు. 

ప్రదోష కాలంలో దక్షిణదిశగా నిలపడి ఆకాశంవైపు దీపాన్ని చూపుతారు. ఈ దీపం మన పితృదేవతలకు జ్యోతిరాదిత్య మార్గంలో బ్రహ్మలోకానికి దారి చూపుతుందని, వారికి నరకబాధ ఉండదని, మనం పితరులను మరచి పోలేదనే తృప్తి వారి ఆత్మలకు కలిగి స్తుందని ధర్మశాస్త్రం అంటుంది. 

నరక చతుర్దశి రోజు సూర్యుడు తులారాశిలో, చంద్రుడు స్వాతీ నక్షత్రంలో ఉంటారు. ఆ సమయంలో అగ్ని ఆరాధన, నదీస్నానం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి.

#Naraka Chaturdasi  #Deepavalli  #Festival stories  #Hindu temples guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

KALIKA Matha Temple | Miyapur | Hyderabad | Hindu Temples Guide