ISKCON Temple | Nampally | Hindu temples guide
ఈ ఆలయం హైదరాబాద్ లోని నాంపల్లి లో కలదు. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు శ్రీ కృష్ణుడు. ఈ ఆలయం చాలా పెద్దగా ఉంటుంది. శ్రీ కృష్ణుడి విగ్రహం చూడగానే ఇట్టే ఆకర్షిస్తుంది. అలయాలో ప్రతిరోజూ ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఆలయ సందర్శకులకు ఉచిత భోజనని అందిస్తారు. ఉచితం మాత్రమే కాకుండా మనకి బయట చాలా ప్రాంతాలలో కేవలం 5/- కే బోజనం పెట్టె వారు ఈ సంస్థ వారే నిర్వహిస్తున్నారు.
పౌర్ణమి , రాధా అష్టమి , కృష్ణాష్టమీ , ఇతర పండుగలలో అధిక రద్దీ ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ కృష్ణ భజన చాలా బాగా జరుగుతుంది. ఆడవారు గోపిక వస్త్రధారణలో చాలా బాగా కనిపిస్తారు. కారణం ఈ ఆలయంలో కేవలం సంప్రదాయ దుస్తులలో మాత్రమే పంపిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 05:30 నుంచి 01:00
01:00 నుంచి 03:00 వరకు బ్రేక్
సాయంత్రం : 03:00 నుంచి 08:30వరకు
#ISKCON Temple #Nampally #Hindu temples guide #Hyderabad temples

Comments
Post a Comment