Sri Rajarajeshwari devi | Hindu temples guide
శారదా నవరాత్రులు : ఇంద్రకీలాద్రి పై ఈ రోజు సకల లోకాలకు ఆరాధ్య దేవత శ్రీ రాజరాజేశ్వరిగా అమ్మవారి అలంకరణ.
-
శ్రీ రాజరాజేశ్వరీదేవి :
-
అంబా శాంభవి చంద్రమౌళీ రబలా వర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రిణయనీ కాత్యాయనీభైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మి ప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి
-
శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మాండాలకు రాజరాజేశ్వరీ దేవి ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది.
ఈ దేవిని "అపరాజితాదేవి"గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. #పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది.
ఈమె యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత. "ఐం క ఏ ఈల హ్రీం, క్లీం హసకహల హ్రీం సౌ: సకల హ్రీం" అనే మంత్రం జపించాలి. లలితా సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన చేయాలి.
లడ్డూలు నివేదన ఇవ్వాలి. సువాసినీ పూజ చేయాలి. అవకాశం ఉంటే శ్రీ చక్రార్చన చేస్తే మంచిది.
నైవేద్యం - లడ్డూలు,పులుహోర,గారెలు.
విజయదశమి శుభాకాంక్షలు.
#Hindu temples guide #Dasara #Vijayawada

Comments
Post a Comment